News December 25, 2025
హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్..

HYDలో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్‌కి చేరింది. చలికాలం పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ గురువారం తెల్లవారుజామున 240కి చేరింది. శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలు అని డాక్టర్లు సూచిస్తున్నారు. తెల్లాపూర్ ఏరియాలో 422గా నమోదు కావటం గమనర్హం.
SHARE IT
Similar News
News December 27, 2025
లవ్లీ హోం హ్యాక్స్

* తలుపులు, గోడలమీద అంటించిన స్టిక్కర్ల మరకలు త్వరగా వదలాలంటే ముందుగా యూకలిప్టస్ ఆయిల్ రాసి తరువాత శుభ్రపరిస్తే సరిపోతుంది.
* గది తాజా పరిమళాలు వెదజల్లాలంటే వెనిగర్‌ని స్ప్రే చేయాలి.
* కత్తెర మొద్దుబారినప్పుడు అల్యూమినియం ఫాయిల్ చిన్న చిన్న ముక్కలుగా కత్తిరిస్తే పదునెక్కుతుంది.
* వంటగది మూలల్లో బోరిక్ పౌడర్ వేసి ఉంచితే, బొద్దింకలు ఆ దరిదాపులకి రావు.
News December 27, 2025
నేడు మానుకోటలో ఆ ఇద్దరు!

ఒకరు ప్రతిపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మరొకరు సీఎం తర్వాత సీఎం అంతటి లీడర్ ఇద్దరు ఓకే రోజు మహబూబాబాద్‌లో శనివారం పర్యటిస్తున్నారు. కేటీఆర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఉప్పు, నిప్పు లాంటి నేతలు ఒకరిపై మరొకరు ఎలాంటి పరుష పదాలు వాడుతారో? అని మానుకోట ప్రజలు ఎదురు చూస్తున్నారు.
News December 27, 2025
ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు?

TG: ఫిబ్రవరి రెండో వారం నాటికి మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో GHMCతో కలిపి 8 కార్పొరేషన్లు, 125 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో చాలా వాటికి ఈ ఏడాది జనవరిలోనే గడువు ముగిసింది. GHMCతో పాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల గడువు 2026 ఫిబ్రవరితో ముగియనుంది. అటు జనవరి రెండో వారం నాటికి తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు ఎన్నికల సంఘం కార్యాచరణ రూపొందించింది.


