News December 28, 2025
హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్

HYDలో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్‌కి చేరింది. చలికాలం పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ ఆదివారం తెల్లవారుజామున 261కి చేరింది. శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలు అని డాక్టర్లు సూచిస్తున్నారు. బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, మల్లాపూర్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.
SHARE IT
Similar News
News February 20, 2026
ఉద్యమంలో యుద్ధభూమి HYD.. ఇది కథ కాదు!

తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా ఉరకలేసింది. 2012-14లో HYD యుద్ధభూమిని తలపించింది. పుస్తకాలు పట్టాల్సిన విద్యార్థులు పోరుబాట పట్టారు. తెలంగాణ గొంతుక అయ్యారు. బుల్లెట్ల వర్షంలోనూ బరిగీసి నిలబడ్డారు. ముళ్ల కంచెలను తొక్కుకుంటూ దూసుకెళ్లారు. NCC గేట్ వద్ద చిందిన రక్తం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని రగిల్చింది. నాడు ‘జై తెలంగాణ’ తప్ప మరో నినాదం వినబడలేదు. ప్రపంచంలోనే ఓ గొప్ప ఉద్యమం ఇదే. ఫలితమే నేటి తెలంగాణ.
News February 20, 2026
HYD: రూ.4000 వ్యాక్సిన్ ఉచితం

HYDలోని బాలికలకు గుడ్ న్యూస్. గర్భాశయ క్యాన్సర్‌ను తరిమికొట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. FEB చివరి నుంచి నగరంలోని బస్తీ దవాఖానలు, PHCల్లో 14-15 ఏళ్ల బాలికలకు ఉచితంగా HPV టీకాలు వేయనున్నారు. బయట దాదాపు రూ.4,000 ఉండే ఈ ‘గార్డాసిల్ 4’ వ్యాక్సిన్ ఇప్పుడు పైసా ఖర్చు లేకుండా లభిస్తుంది. HYD వేలాది మంది, TGలో 4.6 లక్షల మందికి మేలు జరగనుంది. ఈ వ్యాక్సిన్ 14-15 ఏళ్ల మధ్య వయస్సు గల బాలికలకు పంపిణీ చేస్తారు.
News February 20, 2026
HYD: మలి దశను మలుపు తిప్పిన మహోద్యమలు

ప్రత్యేక తెలంగాణ సాధనకు హైదరాబాద్ ఉద్యమాలకు కేంద్రబిందువైంది. ‘మిలియన్ మార్చ్’ ఉప్పెనలా ఉప్పొంగింది. ‘సాగరహారం’ ఉద్యమానికి ఉవ్వెత్తున ఊపిరిపోసింది. ‘సకలజనుల సమ్మె’ రాష్ట్రాన్ని స్థంభింపజేసింది. ‘మానవహారం’ ఉద్యమ ఆత్మను ప్రతిబింబించాయి. ‘సడక్‌బంద్’ సమైక్య పాలకులకు సమస్య తీవ్రతను చాటిచెప్పింది. చివరకు 2014 FEB 20న RSలో బిల్లు పాసై నాలుగున్నర కోట్ల మోముల్లో నవ్వులు పూశాయి.


