News March 19, 2024
హైదరాబాద్‌లో నేటి TOP NEWS

> నాంపల్లిలో వ్యక్తి మృతి
> రాజేంద్రనగర్ యూనివర్సిటీలో ఫొటోగ్రఫీపై నైపుణ్య శిక్షణ
> రియల్ ఎస్టేట్ పేరుతో మోసం.. బాధితుల ఆందోళన
> మ్యాన్‌హోళ్లు, నాలాలపై GHMC స్పెషల్ ఫోకస్
> ఓయూ పీఎస్ పరిధిలో పల్టీ కొట్టిన కారు.. ఒకరి మృతి
> నకిలీ సాస్‌లు తయారు చేస్తున్న ముఠా ARREST
> చందానగర్‌లో కారులో మంటలు
> జీడిమెట్లలో 9వ అంతస్తు నుంచి పడి ఒకరి మృతి
> సీ&డీ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి: రోనాల్డ్ రోస్
Similar News
News April 19, 2025
HYDలో వ్యభిచార ముఠా గుట్టురట్టు

SEC రాంగోపాల్ పేట్ బాపుబాగ్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కాసమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఇద్దరు యువతులను రక్షించి, ముఠాలోని అవియాజ్, హుస్సేన్‌లను అరెస్ట్ చేశారు. ఉద్యోగాల కోసం HYDకు వచ్చిన అమాయకపు యువతులను స్వప్న అనే మహిళ ఈ కూపంలోకి దించుతోందని గుర్తించారు. ఈ ముఠాలోని లడ్డు, స్వప్న పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
News April 19, 2025
HYDలో తరచూ కనిపిస్తున్న చిరుత

నగరంలోని పలు ప్రాంతాల్లో 2014 నుంచి చిరుతలు కనిపిస్తున్నాయి. మొదటిసారి 2014లో ఇక్రిశాట్లో కనిపించగా జూన్ 2019లో మళ్లీ ఇక్రిశాట్‌లో కనిపించింది. ఆ తరువాత జనవరి 2020లో కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో, డిసెంబర్ 2022లో హెటిరో డ్రగ్స్ ప్లాంట్‌లో, మే 2024లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ భూముల్లో, జనవరి 2025లో రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో.. ఇపుడు మళ్లీ ఇక్రిశాట్లో చిరుతలు కనిపించాయి.
News April 19, 2025
కంచన్‌బాగ్‌లో అత్యధికం.. ముషీరాబాద్‌లో అత్యల్పం

నగర వ్యాప్తంగా నిన్న సాయంత్రం కురిసిన వర్షం ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. ఒక చోట ఎక్కువ వర్షం ఉంటే.. మరో చోట తక్కువ వర్షపాతం నమోదైంది. కంచన్‌బాగ్‌లో అత్యధిక వర్షపాతం 8.05 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ముషీరాబాద్‌లో 2.40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బహదూర్‌పురలో 7.88 సెం.మీ యాకుత్‌పురలో 7.63, బేగంబజార్లో 6.98 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.