News April 5, 2024

హైదరాబాద్‌లో నేటి TOP NEWS

image

> కారులో డ్రగ్స్ తరలిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ARREST
> మియాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం
> నగర వ్యాప్తంగా ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
> నల్లకుంటలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుడి అదృశ్యం 
> సికింద్రాబాద్‌ స్టేషన్ సమీపంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న మహిళ ARREST
> అబిడ్స్ పీఎస్ పరిధిలో పోలీసుల తనిఖీలో రూ.40 లక్షలు పట్టివేత
> ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి

Similar News

News December 25, 2024

HYD: కొలువుదీరిన జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పాలకవర్గం

image

ఇటీవల జరిగిన JCHSL ఎన్నికల్లో విజయం సాధించిన డైరెక్టర్‌లు జూబ్లీహిల్స్ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. అధ్యక్షుడిగా బ్రహ్మాండభేరి గోపరాజు, కార్యదర్శి ఎం.రవీంద్రబాబుతో పాటు మిగిలిన సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. కేటాయించని వారికి స్థలాలు సాధించడంతో పాటు, కాలనీ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని వారు పేర్కొన్నారు.

News December 25, 2024

HYD: తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శివ చరణ్ రెడ్డి

image

HYD: తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జక్కిడి శివ చరణ్ రెడ్డిని తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకటించారు. ఈ మేరకు నేడు ఢిల్లీలో ఉదయ్ భాను చిబ్‌, ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ & నేషనల్ యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ క్రిష్ణ అల్లవరు‌ను శివ చరణ్ రెడ్డి కలిశారు. ఈ క్రమంలో ఆయనకు తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు నియామక పత్రం అందజేశారు.

News December 25, 2024

శంషాబాద్‌లో ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం

image

ఉపరాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధన్‌ఖడ్ దంపతులకు శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్రయంలో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఘన స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి మెద‌క్ జిల్లాలోని తునికిలోని ఐసీఏఆర్ విజ్ఞాన కేంద్రానికి షెడ్యూల్ ప్రత్యేక హెలికాప్టర్‌లో వెళ్లారు. విజ్ఞాన కేంద్రంలో సేంద్రియ పంటలు పండిస్తున్న సుమారు 500 మంది రైతులతో ఉపరాష్ట్రపతి మాట్లాడుతారు.