News March 21, 2024
హైదరాబాద్‌లో పార్కింగ్‌పై స్పెషల్ ఫోకస్

నగరంలో ప్రజలకు పార్కింగ్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకొని పూర్తి ప్రణాళికను తయారు చేయాలని కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నగరంలో ఎదుర్కొంటున్న పార్కింగ్ సమస్యలపై చర్చించారు. కాంప్రహెన్సివ్ పార్కింగ్ పాలసీ తయారు చేసేందుకు అధికారులు విధివిధానాలను సిద్ధం చేయాలని సూచించారు.
Similar News
News July 7, 2025
HYD: అన్ని రోడ్లు ఇలా చేస్తే ఎంత బాగుండో.!

HYD శివారు గౌలిదొడ్డి ప్రధాన రహదారి అత్యంత ప్రమాదకరంగా గుంతల మయంగా మారింది. వాహనదారులు నరకయాతన అనుభవించేవారు. స్థానికులు, ప్రయాణికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టి సమస్యలను పరిష్కరించారు. దీంతో HYD నగర వ్యాప్తంగా అన్ని రోడ్లలో ఇలా చేస్తే ఎంత బాగుండోనని అంటూ X వేదికగా నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.
News July 7, 2025
HYD: T WORKS వద్ద నిత్యం ట్రాఫిక్ జామ్.!

HYD నగరంలో అనేక చోట్ల ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పలువురు నెటిజన్లు X వేదికగా ట్వీట్లు చేస్తున్నారు. T WORKS వద్ద రోడ్డు డిజైన్ సైతం సరిగా లేదని, యూటర్న్ సమీపంలోనే ఐలాండ్ నిర్మించడం కారణంగా ట్రాఫిక్ సమస్య మరింత పెరుగుతుందని తెలిపారు. రోడ్డు ఇరుకుగా మారడానికి డిజైన్లు సైతం కారణంగా పలువురు ఆరోపిస్తున్నారు.
News July 7, 2025
HYD: ల్యాండ్ మీద ఇన్వెస్ట్‌మెంట్.. హైడ్రా కీలక సూచన

భూమిపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక సూచన చేశారు. NRI వ్యక్తులు, పెట్టుబడిదారులు భూ కొనుగోలుకు ముందు HMDA వెబ్‌సైట్ ద్వారా FTL, బఫర్‌జోన్ వివరాలు తెలుసుకోవచ్చన్నారు. హైడ్రా కూడా చెరువుల FTL నోటిఫికేషన్ కోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌తో కలిసి పనిచేస్తోంది. శాటిలైట్ డేటా, 2006 మ్యాప్స్ ఆధారంగా త్వరలో 15 సెం.మీ. రిజల్యూషన్‌తో 3Dమోడల్స్ రూపొందిస్తున్నారన్నారు.