News November 11, 2024
హైదరాబాద్‌లో పెరిగిన చలి!
హైదరాబాద్‌లో రోజు రోజుకు చలి పెరుగుతోంది. ఉదయం చాలాచోట్ల పొగమంచు కురుస్తోంది. పటాన్‌చెరు, హయత్‌నగర్, బేగంపేట, దుండిగల్, రాజేంద్రనగర్, ముషీరాబాద్, ఓయూలో 16 డిగ్రీల నుంచి 20 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు తగ్గాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే కోఠి, సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, అబిడ్స్ వంటి ఏరియాల్లో స్వెట్టర్ల దుకాణాలకు గిరాకీ పెరిగింది.
Similar News
News November 22, 2024
HYD: హైకోర్టులో మరో పిటిషన్ వేసిన మాజీ ఎమ్మెల్యే
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. లగచర్ల ఘటనలో మూడు కేసులు నమోదు చేసి మూడు FIRలు చేశారంటూ పిటిషన్ వేశారు. ఒకే ఘటనలో మూడు FIRలు ఎలా చేస్తారంటూ ప్రభుత్వ లాయర్‌ను హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనిపై పోలీసుల వద్ద నుంచి వివరాలు సేకరించి కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వ లాయర్‌ను హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
News November 22, 2024
HYD: ఎంఈ, ఎంటెక్ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
HYD OU పరిధిలోని ఎంఈ, ఎంటెక్ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరిస్తున్నట్లు ఓయూ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ కే.శశికాంత్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల రెండో సెమిస్టర్ మెయిన్, మొదటి, మూడో సెమిస్టర్ మేకప్ పరీక్షా ఫీజును సంబంధిత కళాశాలల్లో ఈ నెల 25వ తేదీ లోపు చెల్లించాలని అన్నారు. అపరాధ రుసుము రూ.500తో 28వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
News November 22, 2024
నేడు శిల్పారామానికి రాష్ట్రపతి
నేడు హైదరాబాద్‌లోని శిల్పారామంలో లోక్ మంథన్ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా వివిధ దేశాల ప్రతినిధులతో మేధోమథన సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.