News January 6, 2026
హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు

HYDలోని ECIL 4 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE/BTech 60% మార్కులతో ఉత్తీర్ణులై, పనిఅనుభవం గలవారు జనవరి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 33 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్, షార్ట్ లిస్టింగ్, DV, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.40వేలు చెల్లిస్తారు. ఏడాదికి రూ.5వేలు పెంచుతారు. వెబ్‌సైట్: https://www.ecil.co.in
Similar News
News February 14, 2026
పార్టీల మధ్య ఆగని ‘వాలంటైన్స్ డే’ వార్

TG: ప్రేమికుల రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పార్టీల వార్ ఆగడం లేదు. మధ్యాహ్నం ఒకరిపై ఒకరు చేసుకున్న ‘వాలంటైన్స్ డే’ విషెస్ విమర్శలు ఇప్పుడు తారస్థాయికి చేరాయి. ‘BRS loves modi more than TG’ అని కాంగ్రెస్ ట్వీట్ చేయగా ‘ఆయనకి ఇద్దరు’ పోస్టర్‌తో బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు BJP కౌంటర్ ఇచ్చింది. ఇక ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ పోస్టర్‌తో బీజేపీ, కాంగ్రెస్, MIMపై BRS సెటైర్లు వేసింది.
News February 14, 2026
బిల్ గేట్స్‌ను మూడుసార్లు ఏపీకి తీసుకొచ్చిన ఘనత నాదే: సీఎం

AP: మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్ ఎల్లుండి రాష్ట్రానికి రానున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయనను మూడుసార్లు APకి తీసుకొచ్చిన ఘనత తనదేనని ఎమ్మెల్యేలతో భేటీలో చెప్పారు. తొలిసారి హైటెక్ సిటీ, రెండోసారి విశాఖ అగ్రిటెక్, ఇప్పుడు సంజీవని పథకం కోసం పిలిపిస్తున్నామన్నారు. కాగా ఈ స్కీమ్ ద్వారా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో గ్రామీణ ఆరోగ్య సేవలు, వ్యాక్సినేషన్, మాతా శిశు సంరక్షణపై ప్రభుత్వం ఫోకస్ చేయనుంది.
News February 14, 2026
సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ స్కోర్ ఎంతంటే?

T20WC: అహ్మదాబాద్‌లో సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ 175-7 స్కోర్ చేసింది. చాప్‌మన్ 48, మిచెల్ 32, అలెన్ 31 పరుగులతో రాణించారు. సౌతాఫ్రికా బౌలర్ జాన్సెన్ 4 వికెట్లు తీసి సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సూపర్-8కి చేరువ కానుంది. ప్రస్తుతం ఇరు జట్లు 2 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో టాప్-2 స్థానాల్లో కొనసాగుతున్నాయి.


