News December 25, 2024
హైదరాబాద్‌లో ప.గో.జిల్లా సాప్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

హైదరాబాదులో ప.గో.జిల్లాకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వీరవాసరం మండలం నవుడూరుకు చెందిన కె. భగవాన్ (26) తన రెంట్ హౌస్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భగవాన్‌కు ఫిబ్రవరి నెలలో వివాహం నిశ్చయమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన చావుకు ఎవరు కారణం కాదని లేఖ రాశాడు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 3, 2026
ప.గో: తల.. మొండెం వేరు వేరుగా

ఆకివీడు మండలం కుప్పనపూడి శివారు తాళ్లకోడులో నమ్మి రాంబాబు(22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అమ్మమ్మ ఇంట్లో ఉంటున్న రాంబాబు మృతదేహం మంగళవారం కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది. మృతదేహం పక్కనే చీర వేలాడుతుండగా.. మొండెం నుంచి తల వేరుపడి ఉంది. సుమారు ఐదు రోజుల క్రితం ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.
News February 3, 2026
పన్నులను డిజిటల్ పేమెంట్ ద్వారా చెల్లించాలి: కలెక్టర్

ఇంటి, కుళాయి పన్నులను డిజిటల్ పేమెంట్ ద్వారా చెల్లించాలని కలెక్టర్ నాగరాణి మంగళవారం సూచించారు. ఆకివీడు మండలం పెద్దకారులో పైలెట్ ప్రాజెక్టుగా పన్నుల వసూలు జరుగుతోందని తెలిపారు. భూమి ధరలకు అనుగుణంగా పన్నులు పెరిగాయని, గ్రామంలో గతంలో రూ. 4 లక్షలుగా ఉన్న పన్నులు రూ. 15 లక్షలకు చేరాయని వివరించారు. ఇప్పటివరకు రూ. 5 లక్షలు వసూలు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
News February 3, 2026
భీమవరం: బాలికపై అత్యాచారం.. జీవిత ఖైదు.!

మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి జీవిత ఖైదు రూ.10వేల జరిమానా, బాధితురాలికి రూ.5.80 లక్షల పరిహారం చెల్లించాలని భీమవరం ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి లక్ష్మీనారాయణ సోమవారం తుది తీర్పు వెల్లడించారు. బాలిక దసరా సెలవులకు ఉండి రాగా మేనత్త కుమారుడు నాగాంజనేయులు పలుమార్లు లైంగికదాడులకు పాల్పడ్డాడు. వార్డెన్‌కు తెలపడంతో వార్డెన్ ఉండి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


