News April 5, 2024
హైదరాబాద్‌లో బయటపడుతున్న నోట్ల కట్టలు
ఎన్నికల నియమావళి అమల్లో భాగంగా గ్రేటర్ వ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్ విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.5.31 కోట్ల నగదు సీజ్ చేసినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. గడిచిన 24 గంటల్లో రూ.27.12 లక్షల నగదు, రూ.8.23 లక్షల విలువజేసే ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అటు నగదు, ఇతర వస్తువులపై 12 ఫిర్యాదులు రాగా.. వాటిని పరిశీలించామన్నారు.
Similar News
News December 25, 2024
హైదరాబాద్‌లో OYOకు ఫుల్ డిమాండ్!
HYD OYO బుకింగ్స్‌లో టాప్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రధాన కారణం.. గల్లీల్లో ఉండే లాడ్జిలను సైతం అధునాతన హంగులతో తీర్చిదిద్ది, అందుబాటు ధరలకే ఇస్తున్నారు. అయితే, నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఈ సారి గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. దేశ విదేశాల నుంచి మన నగరానికి టూరిస్టులు వస్తుంటారు. దీంతో OYO హోటల్స్‌కు ఫుల్ డిమాండ్ పెరిగింది. సోషల్ మీడియాలో ఆయా హాటల్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టడం విశేషం.
News December 25, 2024
HYDలో అర్ధరాత్రి నుంచి సంబరాలు
హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి పండుగ వాతావరణం నెలకొంది. యేసు పుట్టిన రోజు సందర్భంగా అన్ని చర్చిలను అందంగా అలంకరించారు. స్టార్ ఆకారంలో పలుచోట్ల LED లైట్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో సెక్రటేరియట్, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్‌లో క్రిస్‌మస్ ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అయితే, మిడ్ నైట్ 12 గంటలకు చర్చిలకు వెళ్లిన క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Happy Christmas
News December 25, 2024
HYD: చీకటి ప్రాంతాలే అడ్డాగా..!
HYD శివారు చీకటి ప్రాంతాలను చైన్ స్నాచింగ్, గంజాయి, అసాంఘిక కార్యక్రమాలకు ముఠాలు అడ్డగా మార్చుకుంటున్నట్లు వివిధ కేసుల్లో తెలిసింది. శామీర్‌పేట, పెద్ద అంబర్ పేట, ఔటర్ రింగ్ రోడ్డు సమీప ప్రాంతాల్లో అన్నోజిగూడ, యమ్నంపేట, ఘట్కేసర్, మాధవరెడ్డి బ్రిడ్జి, అవుషాపూర్, తోండుపల్లి జంక్షన్, మల్లంపేట నుంచి దుండిగల్ వైపు ప్రాంతాల్లో ముఠాలు తిష్ట వేస్తున్నాయి.