News August 31, 2024
హైదరాబాద్‌లో మిలాద్ ఉత్సవాలు వాయిదా

హైదరాబాద్‌లో మిలద్-ఉన్-నబి ఉత్సవాలు వాయిదా పడ్డాయి. సెప్టెంబర్ 16వ తేదీకి బదులుగా అదే నెల 19వ తేదీన జరుగనున్నాయి. ఈ మేరకు మిలాద్ వేడుకల నిర్వహణ కమిటీ నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి వేడుకలను దృష్టిలో ఉంచుకుని మిలాద్ కమిటీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. గణేష్ చతుర్థి, మిలాద్-ఉన్-నబీ పండగలు కలిసి వచ్చినందున వాటి ఏర్పాట్లపై సీఎం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
Similar News
News December 22, 2025
రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్

హైదరాబాద్: రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ కలకలం రేగింది. 40 మంది యూనివర్సిటీ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన యూనివర్సిటీ సిబ్బంది వైద్య చికిత్స నిమిత్తం పలు ఆస్పత్రుల్లో తరలించారు. ఆహారం కలుషితం కావడంతో(డీ హైడ్రేషన్) వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో విద్యార్థులు బాధపడుతున్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News December 22, 2025
రంగారెడ్డి జిల్లా రిటైర్డ్ DMHOపై ఫిర్యాదు

వనస్థలిపురం PS పరిధిలోని హస్తినాపురంలో ఉన్న అరుణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేరును అక్రమంగా, ఆరుష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌గా మార్చారని రంగారెడ్డి జిల్లా రిటైర్డ్ DMHO, ప్రస్తుత DEMOపై ఆరోపణలు వచ్చాయి. గతంలో అదే హాస్పిటల్‌కు MDగా పనిచేసిన Dr.దేవేందర్ RR కలెక్టరేట్‌లోని ప్రజావాణిలో ఈమేరకు ఫిర్యాదు చేశారు. హాస్పిటల్‌పై ఎన్నో కేసులు ఉన్నా.. పేరు ఎలా మారిందని ప్రశ్నించారు.
News December 22, 2025
RR: నేడు సర్పంచ్ సాబ్, మేడమ్ వస్తున్నారు!

సర్పంచ్‌లు, వార్డు సభ్యులు నేడు వారి వారి గ్రామపంచాయతీల్లో ప్రమాణం చేయనున్నారు. రంగారెడ్డి జిల్లాలో 3 విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 526 GPలకు 525 గ్రామాల్లో కొత్త పాలకవర్గాలను ఎన్నుకున్నారు. నేడు వారితో పంచాయతీ సెక్రటరీలు ప్రమాణం చేయిస్తారు. కాగా జిల్లాలో మాడ్గుల మండలంలోని నర్సంపల్లి GPకి ఎన్నిక జరగలేదు. ప్రమాణ స్వీకారంపై జిల్లాలోని MPDOలు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు.


