News March 19, 2025

హైదరాబాద్‌లో ముంచుకొస్తున్న ముప్పు!

image

HYD‌కు ముప్పు ముంచుకొస్తోంది. ఈ వేసవిలో నీటి కొరత ఏర్పడే పరిస్థితి ఉంది. భూగర్భ జలాలు క్రమంగా తగ్గుతున్నాయి. ORR వరకు 948 చ.కిమీ మేర ఏకంగా 921 చ. కిమీ మేర భూగర్భ జలాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు జలమండలి నివేదికలో వెల్లడైంది. ప్రతిరోజు దాదాపు 11 వేల ట్యాంకర్లను నగరవాసులు బుక్ చేసుకుంటున్నారు. IT కారిడార్, కూకట్‌పల్లి, మాదాపూర్‌, శేరిలింగంపల్లి వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది.

Similar News

News July 4, 2025

బంజారాహిల్స్‌లోని వరుణ్ మోటార్స్ సీజ్

image

బంజారాహిల్స్ రోడ్ నం.2లోని వరుణ్ మోటార్స్‌ను GHMC అధికారులు సీజ్ చేశారు. గత రెండేళ్లుగా ట్రేడ్ లైసెన్స్ లేకుండా వరుణ్ మోటార్స్ నిర్వహకులు వ్యాపారం చేస్తుండడంతో పలుమార్లు అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో ఇవాళ సీజ్ చేశారు. గత మూడేళ్లుగా అడ్వర్‌టైజ్మెంట్ ఫీజులు బకాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

News May 8, 2025

ఓయూ: పరీక్షా ఫలితాలు విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలతో పాటు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని సూచించారు.

News May 7, 2025

HYD: ‘కారు’లన్నీ అటువైపే!

image

BRS రజతోత్సవ సభ కోసం నగర శ్రేణులు సిద్ధమయ్యాయి. నియోజకవర్గం నుంచి వేలాది మంది కార్యకర్తలను తరలించేందుకు నాయకులు వాహనాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్‌ను LED లైట్లతో అందంగా అలంకరించారు. సభ వరంగల్‌లో అయినా హైదరాబాద్ కేంద్రంగా పార్టీ నేతలకు కీలక ఆదేశాలు వెళ్లాయి. బస్సులు, డీసీఎంలు, కార్లు ఘట్‌కేసర్‌ మీదుగా ఎల్కతుర్తి సభా ప్రాంగణానికి చేరుకోనున్నాయి. ఇందుకు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేశారు.