News March 19, 2025
హైదరాబాద్‌లో ముంచుకొస్తున్న ముప్పు!

HYDకు ముప్పు ముంచుకొస్తోంది. ఈ వేసవిలో నీటి కొరత ఏర్పడే పరిస్థితి ఉంది. భూగర్భ జలాలు క్రమంగా తగ్గుతున్నాయి. ORR వరకు 948 చ.కిమీ మేర ఏకంగా 921 చ. కిమీ మేర భూగర్భ జలాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు జలమండలి నివేదికలో వెల్లడైంది. ప్రతిరోజు దాదాపు 11 వేల ట్యాంకర్లను నగరవాసులు బుక్ చేసుకుంటున్నారు. IT కారిడార్, కూకట్‌పల్లి, మాదాపూర్, శేరిలింగంపల్లి వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది.
Similar News
News November 4, 2025
దీపావళి, కార్తీక పౌర్ణమి రోజుల్లో బాణాసంచా ఎందుకు కాల్చుతారు?

భాద్రపద మాసంలో అంటువ్యాధులు వ్యాప్తి చెందుతాయి. వర్షాల కారణంగా భూమిపై విషపూరితమైన ఆవిరి పేరుకుపోతుంది. ఈ కలుషిత గాలిని పీల్చడం వలన రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే.. ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో వచ్చే పర్వదినాల్లో పసుపు, గంధకం, సురేకారం వంటి ద్రవ్యాలతో తయారుచేసే బాణాసంచాను కాల్చుతారు. వీటి నుంచి వచ్చే విపరీత కాంతి, పెద్ద ధ్వని, పొగ.. ఇవన్నీ క్రిమి సంహారిణిగా పనిచేసి, వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది.
News November 4, 2025
గద్వాల: భార్య చావుకు కారణమైన భర్తకు ఏడేళ్లు జైలు

అదనపు కట్నం కోసం భార్యను వేధించి ఆమె మృతికి కారణమైన భర్తకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి ప్రేమలత సోమవారం తీర్పునిచ్చారు. అలంపూర్ మండలం సింగవరం గ్రామానికి చెందిన చాకలి హరికృష్ణ తన భార్య మల్లికను వేధించడంతో ఈ ఘటన జరిగిందని శ్రీనివాసరావు తెలిపారు. మల్లిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 4, 2025
‘ప్రతి కదలికలో పరమేశ్వరుడిని చూడాలి’

జీవితంలో ప్రతి అంశాన్ని దైవారాధనగా భావించి, ప్రతి క్షణం పరమాత్మలో లీనమై జీవించడమే మానవ జీవిత లక్ష్యమని ‘భక్తి యోగం’ పేర్కొంది. ‘ఓ దేవా! నా ఆత్మ నీవే, నా బుద్ధియే పార్వతి. నా శరీరమే నీ గృహం. నా పంచప్రాణాలు నీ పరిచారకులు. నా ప్రతి అనుభవం నీకు చేసే పూజే. నా నిద్ర కూడా యోగ సమాధితో సమానం. నేను నడిచే ప్రతి అడుగు నీకు ప్రదక్షిణం. నేను పలికే ప్రతి మాట నీ స్తోత్రం’ అంటూ పరమాత్మను సేవించాలని సూచిస్తోంది.


