News November 4, 2025
హైదరాబాద్‌లో మొదలైన వర్షం

TG: హైదరాబాద్‌లో వర్షం మొదలైంది. మల్కాజ్‌గిరి, ఉప్పల్, కాప్రా, ఉస్మానియా యూనివర్సిటీ, నాచారం, తార్నాక, సికింద్రాబాద్, రామంతాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కాసేపట్లో ఎల్బీ నగర్, సరూర్ నగర్, వనస్థలిపురం, చార్మినార్, నాంపల్లి, రాజేంద్రనగర్ ఏరియాల్లోనూ వాన పడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.
Similar News
News November 4, 2025
చంద్రబాబు, లోకేశ్‌పై జగన్ సెటైర్లు

AP: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా CM చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై YCP అధినేత జగన్ సెటైర్లు వేశారు. ‘ఇంత విపత్కర పరిస్థితిలో సీఎం ఒక రోజు వస్తాడు. అలా చాపర్‌లో తిరుగుతాడు. మరుసటి రోజు లండన్‌కు పోతాడు. ఆయన కొడుకు ఆస్ట్రేలియా నుంచి వస్తాడు. మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడటానికి పోతాడు’ అని ఎద్దేవా చేశారు. రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
News November 4, 2025
రేపు పలు జిల్లాలకు వర్షసూచన

AP: కోస్తా తీరానికి ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని APSDMA తెలిపింది. దీంతో రేపు కోనసీమ, కృష్ణా, GNT, బాపట్ల, ప్రకాశం, NLR, కర్నూలు, KDP, TPT జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి వానలకు ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది. ఇవాళ 5PM వరకు బాపట్లలో 61.5MM, నంద్యాల(D) నందికొట్కూరులో 51.7MM అధిక వర్షపాతం నమోదైనట్లు చెప్పింది.
News November 4, 2025
ఇక ఎందులో ప్రయాణించాలి?

ఇటీవల పలు బస్సు ప్రమాదాలు ప్రజల్లో భయాన్ని నింపాయి. స్లీపర్ బస్సుల వైపు అయితే కొంతకాలం చూడకూడదనే పరిస్థితి తెచ్చాయి. బస్సులెందుకు ట్రైన్లలో వెళ్దామనుకుంటే ఇవాళ ఛత్తీస్‌గఢ్ రైలు ప్రమాదం డైలమాలోకి నెట్టింది. ఇక ఎందులో ప్రయాణించాలి? అనే చర్చ ఏ ఇద్దరు కలిసినా విన్పిస్తోంది. అయితే వాహనం ఏదైనా యాక్సిడెంట్లు జరగొచ్చని, వాటి నియంత్రణకు ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.


