News March 26, 2024

హైదరాబాద్‌లో యువకుడి దారుణహత్య..!

image

హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. జీడిమెట్ల PS పరిధి సుభాష్‌నగర్ శ్మశానవాటిక వద్ద జైలర్ (24) అనే బిహార్‌కు చెందిన యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. గుల్బర్గాకు చెందిన సలీం ఈ హత్య చేసినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 18, 2025

చారిత్రక సంపదలో ‘షాందార్ హైదరాబాద్’

image

చారిత్రక సంపదకు పుట్టినిల్లు మన HYD. నగర నిర్మాణ చిహ్నానికి చార్మినార్, 12వ శతాబ్దంలో నిర్మించిన గోల్కొండ కోట, రాజభవనాలకు కేరాఫ్‌గా చౌమహల్లా ప్యాలెస్‌, మాల్వాల ప్యాలెస్‌ ఉన్నాయి. కళా ప్రపంచంలో సాలార్‌జంగ్ మ్యూజియం ఓ మాస్టర్ పీస్. ట్యాంక్‌బండ్, కుతుబ్‌ షాహీ టూంబ్స్‌ మక్కా మసీద్, తారామతి బరాదారి, తోలి(డమ్రి) మసీద్, పైగా టూంబ్స్, స్పానీష్ మసీద్‌ నగర వారసత్వ సంపదకు ఆనవాళ్లు. నేడు World Heritage Day

News April 18, 2025

HYD: గోల్కొండ కోటలోకి FREE ENTRY

image

వరల్డ్‌ హెరిటేజ్‌ డే సందర్భంగా హైదరాబాద్ వాసులకు శుభవార్త. శుక్రవారం గోల్కొండ ఫోర్ట్‌లోకి ఫ్రీ ఎంట్రీ ఉంటుందని సీనియర్‌ పరిరక్షణ అధికారి మల్లేశం వెల్లడించారు. ప్రతి యేటా ఈ రోజు ఉచితంగా కోటను సందర్శనకు అనుమతి ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని చారిత్రక కట్టడాలకు ఈ వెసులుబాటు కల్పించారు. నగరవాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని గోల్కొండ కోట అధికారులు సూచిస్తున్నారు.
SHARE IT

News April 18, 2025

గుడ్‌న్యూస్: అమర్నాథ్ యాత్రకు గాంధీలో సర్టిఫికెట్లు

image

అమర్నాథ్ యాత్రకు వెళ్లే వారికి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఫిట్నెస్ సర్టిఫికెట్లను ఉచితంగా జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 21 నుంచి సోమ, బుధ, శుక్రవారాల్లో ఉ.10:30 గంటలకు ప్రధాన భవనం, మెడికల్ రికార్డ్స్ డిపార్ట్‌మెంట్‌లో ఈ సర్టిఫికెట్ పొందవచ్చు. దరఖాస్తుతో పాటు రక్త పరీక్షలు, ఛాతి ఎక్స్‌రే, బ్లడ్ గ్రూపు పరీక్షల రిపోర్ట్‌లను తీసుకురావాలని తెలిపారు.

error: Content is protected !!