News March 1, 2025
హైదరాబాద్‌లో రేపటి నుంచి నైట్‌ఔట్!

నైట్ ఔట్ కల్చర్ మన హైదరాబాదీలకు కొత్తేమీ కాదు. కానీ, రేపటి నుంచి నగరంలో కొత్త రూల్స్ ఉండబోతున్నాయి. రంజాన్ నెల సందర్భంగా వ్యాపారులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. 24 గంటలూ దుకాణాలు ఓపెన్ చేసేందుకు ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. రేపటి నుంచి మార్చి 31 వరకు ఈ రూల్స్ అమల్లో ఉంటాయి. ఇక మిడ్‌నైట్ షాపింగ్‌కు మన చార్మినార్‌లోని వ్యాపారులు సిద్ధమవుతున్నారు.
Similar News
News March 1, 2025
ఫస్ట్ షోరూమ్‌ను టెస్లా ఎక్కడ ఓపెన్ చేస్తోందంటే..

భారత్‌కు టెస్లా మరింత చేరువైంది. ముంబై బాంద్రాకుర్లా కాంప్లెక్స్‌లో షోరూమ్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది. ఓ కమర్షియల్ కాంప్లెక్సులోని అండర్‌గ్రౌండులో 4000 sft స్పేస్‌ను ఐదేళ్లు లీజుకు తీసుకుంది. ఒక sftకి రూ.900 చొప్పున నెలకు ₹35లక్షల రెంటు చెల్లించనుంది. రెండో షోరూమ్‌ను ఢిల్లీలోని ఏరోసిటీ కాంప్లెక్స్‌లో ఆరంభిస్తుందని సమాచారం. టెస్లా ఇప్పటికే ఉద్యోగుల హైరింగ్ ప్రాసెస్ చేపట్టడం గమనార్హం.
News March 1, 2025
మామునూర్‌లో తీవ్ర ఉద్రిక్తత

వరంగల్ మామునూర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎయిర్ పోర్ట్ క్రెడిట్ విషయంలో వివాదం తెలత్తినట్లు సమాచారం. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించగా.. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరగడంతో పోలీసులు భారీగా మోహరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 1, 2025
బాపట్ల జిల్లా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ తుషార్ డూడి పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి పరీక్షా కేంద్రాల వద్ద గడ్డి బందోబస్తు చేపట్టామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లను మూసి వేయించామని, మాస్ కాపీ ఎక్కువ అవకాశం లేకుండా చర్యలు చేపట్టామన్నారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామన్నారు.