News July 25, 2024
హైదరాబాద్‌లో ర్యాపిడో డ్రైవర్ హత్య

హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానికుల ప్రకారం.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి రోడ్ నంబర్ 12 NBTనగర్‌లో యువకుడిని హత్య చేశారు. మంగళవారం రాత్రి మహమ్మద్ ఖాజా పాషా(ర్యాపిడో డ్రైవర్), అతడి స్నేహితుడు పర్శకు గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపంతో పాషాపై కర్రతోదాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News July 6, 2025
చివరికి కల్లు కాంపౌండుకు రమ్మంటారా ఏంటి..?: జగ్గారెడ్డి

‘రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై చర్చించేందుకు కేసీఆర్‌ను అసెంబ్లీకి ఆహ్వానిస్తే ప్రెస్ క్లబ్, బోట్స్ క్లబ్‌కు రావాలని.. అక్కడ చర్చిద్దామని కేటీఆర్ అంటున్నాడు. చివరికి కల్లు కాంపౌండుకు రావాలని పిలుస్తారా ఏంటి?’అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. CM రేవంత్.. కేసీఆర్‌ను పిలుస్తుంటే సెకెండ్ బెంచ్ లీడర్లు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని గాంధీభవన్‌లో విమర్శించారు.
News July 6, 2025
HYD: త్వరలో వాట్సప్ బస్ టికెట్

గ్రేటర్ HYDలో త్వరలో వాట్సప్ టికెటింగ్, డిజిటల్ బస్ పాస్ అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇప్పటికే క్యూఆర్ కోడ్ RTC బస్ టికెట్ విధానం అందుబాటులో ఉంది. జస్ట్ QR కోడ్ స్కాన్ చేసి, ఫోన్లో పేమెంట్ చేస్తే టికెట్ వస్తుంది. ఇవన్నీ ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టంలో ఒక భాగం. ఈ సేవలను మరింత విస్తరిస్తామని తెలిపారు.
News July 6, 2025
బోరబండలో భార్యను హత్య చేసిన భర్త

HYD బోరబండ PS పరిధిలో భార్యను భర్త హత్య చేశాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా.. సోనీ, నర్సింలు దంపతులు. మద్యానికి బానిసై నర్సింలు తాగివచ్చి తరుచూ చిత్రహింసలకు గురి చేసేవాడు. ఈ నేపథ్యంలో భార్య సోనీ తన పుట్టింటికి వెళ్లింది. తిరిగి వచ్చిన తర్వాత 3 రోజులుగా మళ్లీ చిత్రహింసలు పెడుతూ విచక్షణారహితంగా కొట్టడంతో సోనీ మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.