News July 25, 2024
హైదరాబాద్‌లో ర్యాపిడో డ్రైవర్ హత్య

హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానికుల ప్రకారం.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి రోడ్ నంబర్ 12 NBTనగర్‌లో యువకుడిని హత్య చేశారు. మంగళవారం రాత్రి మహమ్మద్ ఖాజా పాషా(ర్యాపిడో డ్రైవర్), అతడి స్నేహితుడు పర్శకు గొడవ జరిగింది. ఈ క్రమంలో కోపంతో పాషాపై కర్రతోదాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News February 12, 2026
RR: రేపే లెక్కింపు.. మధ్యాహ్నానికే ఫలితాలు!

మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు సర్వం సిద్ధమైంది. రేపు 64 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, ఇందుకోసం 254 మంది సిబ్బందిని నియమించారు. షాద్‌నగర్‌లో అత్యధికంగా 14, ఆమనగల్‌లో అత్యల్పంగా 5 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల లోపు ఫలితాలు వెల్లడించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈనెల 16న చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపికకు సంబంధించి ఇన్‌ఛార్జ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
News February 12, 2026
ఫ్యూచర్ సిటీ, RRR.. పల్లెల రూపు రేఖలు మారనున్నాయా.?

ఎన్ని అడ్డంకులు ఎదురైనా భారత్ ఫ్యూచర్ సిటీ పేరుతో గొప్ప నగరాన్ని నిర్మించి చూపిస్తామని రేవంత్ సర్కార్ ఢంకా బజాయించి చెబుతోంది. దీంతో పాటు కందుకూరు, యాచారం, తలకొండపల్లి, ఆమనగల్ ప్రాంతాల మీదుగా రీజనల్ రింగ్ రోడ్డు కూడా రానున్న విషయం విదితమే. ఈ ప్రాజెక్టుల గనుక నిర్మాణం చేపడితే ఇక్కడి పల్లెల రూపు రేఖలు నిజంగా మారే అవకాశం ఉందా అని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. మీ కాంమెంట్.
News February 11, 2026
3pm రంగారెడ్డి అప్‌డేట్.. దూసుకొచ్చిన ఆమన్‌గల్

RR మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఊపందుకుంది. 2 తర్వాత ఓటర్లు కేంద్రాలకు కదిలారు. జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో 1, 2 మినహా మిగతా వార్డుల్లో పోలింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. మ.3గం. వరకు జిల్లాలో 68.77% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఆమనగల్లులో 76.33%, చేవెళ్ల 73.04% ఇబ్రహీంపట్నం 68.6%, మొయినాబాద్ 69.79, శంకర్‌పల్లి 65.19, షాద్‌నగర్‌లో 65.25% నమోదైంది. పోలింగ్‌కు మరో 1:10 గం. సమయం మిగిలి ఉంది.


