News August 31, 2024

హైదరాబాద్‌లో వర్షం.. జాగ్రత్త!

image

హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ప్రస్తుతం చిరుజల్లులు పడుతున్నాయి. రాజధాని రోడ్లన్నీ తడిసి ముద్దయ్యాయి. నేడు, రేపు భారీ వర్ష సూచనతో అధికారులు అప్రమత్తమయ్యారు. తడి రోడ్ల మీద వాహనాలను నెమ్మదిగా నడపాలని ఓ వైపు ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఎదైనా అత్యవసరమైతే 040-21111111, 9000113667 నంబర్లను సంప్రదించాలని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు.
SHARE IT

Similar News

News November 15, 2025

గచ్చిబౌలి స్టేడియంలో రెజోఫెస్ట్ 2025

image

గచ్చిబౌలి స్టేడియంలో 2 రోజుల రెజోఫెస్ట్ 2025 ముగిసింది. నిన్న ముఖ్యఅతిథిగా 48th ఛీప్ జస్టిస్ NV రమణ హాజరై 16 రెజోనెన్స్ కొత్త స్కూల్స్‌ ప్రారంభించారు. విజ్ఞాన్ యూనివర్సిటీ ఛైర్మన్ లావు రత్తయ్య, శాంత బయోటెక్నోస్ ఛైర్మన్ వరప్రసాద్‌రెడ్డి, యాక్టర్లు సాయిదుర్గ తేజ్, మౌళి, దర్శకుడు అనిల్ రావిపూడి విద్యార్థులకు లక్ష్య సాధన గురించి వివరించారు. నిన్న 35 క్యాంపస్‌‌‌ల విద్యార్థులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.

News November 15, 2025

HYD: ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎప్పటి నుంచంటే!

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌ ఎత్తివేతకు రంగం సిద్ధమైంది. అక్టోబర్ 6న అధికారులు కోడ్‌ను అమల్లోకి తెచ్చారు. ఎన్నికల నామినేషన్ల నుంచి కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించారు. రేపటితో ఎన్నికల కోడ్ ముగియనుంది. ఇక సోమవారం నుంచి ప్రభుత్వ పథకాలు, ఇతర అభివృద్ధి పనులు మొదలుకానున్నాయి. 17వ తేదీ నుంచి GHMC ‘ప్రజావాణి’ పునరుద్ధరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

News November 15, 2025

ఢిల్లీకి నవీన్ యాదవ్.. మతలబ్ ఏంటి?

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన నవీన్ యాదవ్‌కు ఢిల్లీలో ప్రశంసలు వచ్చాయి. CM రేవంత్, dy.CM భట్టి, PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి ఆయన రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేను కలిశారు. జూబ్లీలోని బస్తీ వాసులు గెలిపించిన నాయకుడు ఢిల్లీకి వెళ్లడం తాజా రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. పట్టులేని చోట కాంగ్రెస్‌ను నిలబెట్టిన యూసుఫ్‌గూడ బస్తీ వాసికి అదనపు బాధ్యతలు ఏమైనా అప్పగిస్తారా? అనే చర్చ మొదలైంది.