News March 18, 2024
హైదరాబాద్‌లో వర్షం

హైదరాబాద్‌లో వర్షం మొదలైంది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురిసింది. లింగంపల్లి, BHEL, చందానగర్, గచ్చిబౌలితో పాటు.. పలు ప్రాంతాల్లో కురిసింది. మీ ప్రాంతంలో కూడా వర్షం ఉంటే కామెంట్‌లో తెలపండి.
Similar News
News December 28, 2025
HYD: ఐటీ హబ్‌లో Monday Blues!

IT కారిడార్లలో ఇప్పుడు ‘మండే బ్లూస్’ సరికొత్త రూపం దాల్చాయి. సండే నైట్ నుంచే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను ‘సోమవారం భయం’ వెంటాడుతోంది. ‘బేర్ మినిమమ్ మండే’ పేరుతో కేవలం లాగిన్ అయ్యామనిపించడం, మీటింగ్‌లో కెమెరాలు ఆపేయడం, అత్యవసరమైతే తప్ప పని ముట్టుకోకపోవడం ఫ్యాషన్‌గా మారింది. కార్పొరేట్ కొలువుల్లో ఈ సోమరితనం మానసిక ప్రశాంతతా? లేక బాధ్యతారాహిత్యమా? అన్న చర్చ మొదలైంది. ఈ ‘మండే సిండ్రోమ్’ మీ ఆఫీసులోనూ ఉందా?
News December 28, 2025
న్యూ ఇయర్ నుంచే నుమాయిష్

నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నుమాయిష్ న్యూ ఇయర్ రోజే ప్రారంభం కానుంది. 85వ ఎడిషన్ JAN 1 నుంచి FEB 15 వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరగనుంది. ముఖ్య అతిథిలుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై ప్రారంభిస్తారు. ఈ సారి ఎగ్జిబిషన్‌లో 1050 స్టాళ్లు ఉంటాయి. 4PM నుంచి 10:30PM వరకు తెరిచి ఉంటుంది. ఎంట్రీ టికెట్ ధర రూ.50గా నిర్ణయించారు. 5 ఏళ్ల లోపు పిల్లలకు FREE.
News December 28, 2025
గచ్చిబౌలికి గుడ్ బై.. ‘ఫ్యూచర్’ ఈ ఏరియాలదే!

మూసీ ప్రక్షాళన ప్లాన్‌లో భాగంగా ఉప్పల్, బాపుఘాట్ ఏరియాలు హాట్ కేకుల్లా మారబోతున్నాయి. 50-60 అంతస్తుల బిల్డింగ్స్‌కు ప్రభుత్వం రూట్ క్లియర్ చేస్తోంది. అసలు పాయింట్ ఏంటంటే.. పూర్తి స్థాయి డీపీఆర్ (DPR) ఇంకా అందరికీ అందుబాటులోకి రాకపోయినా, తెర వెనుక పని జోరుగా సాగుతోంది. రూ.400 కోట్లతో బ్రిడ్జ్-కమ్-బ్యారేజ్‌ల ప్లాన్ దాదాపు ఖరారైంది. ఇందుకోసం నిధుల సర్దుబాటు, గ్రౌండ్ వర్క్ వేగంగా జరుగుతోంది.


