News August 19, 2025
హైదరాబాద్‌లో వానాకాలం చదువులు..!

వానాకాలం చదువులు.. ఈ పేరు విన్నారా.. అంటే వర్షం వచ్చినపుడు ఆరోజు స్కూలుకు వెళ్లేది లేదన్నమాట.. పెద్దలు ఈ మాట చెబుతూ ఉంటారు. ఇపుడు మహానగరంలో ఆ పరిస్థితి నెలకొంది. జీడిమెట్ల అయోధ్య నగర్ ప్రాథమిక ఆవరణ వర్షపు నీటితో నిండిపోయింది. దీంతో విద్యార్థులు లోపలకు వెళ్లలేని పరిస్థితి. సుమారు 230 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఈ సమస్య ఉంటున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
Similar News
News August 19, 2025
HYD: మార్వాడీలను గో బ్యాక్ అనడం ఎందుకు..?: VH

రిలయన్స్, డీ మార్ట్ లాంటి బడా కంపెనీల్లో అన్ని వస్తువులు దొరుకుతున్నప్పుడు.. మార్వాడీలను గో బ్యాక్ అనడం ఎందుకని మాజీ ఎంపీ హనుమంత్‌రావు అన్నారు. మంగళవారం HYD గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడారు. ‘తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది వస్తున్నారు.. ఈ విధమైన నినాదాలతో అభివృద్ధి కుంటు పడుతుంది.. రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.. ఇది సరైన పద్ధతి కాదు’ అని అన్నారు.
News August 19, 2025
HYD: ‘హజ్ యాత్రికులకు గమనిక.. రేపటిలోపు డబ్బు చెల్లించాలి’

హజ్-2026 యాత్రికులకు HYDలో హజ్ కమిటీ కీలక సూచనలు చేసింది. హజ్ యాత్రకు ఎంపికైన వారు ఈనెల 20లోపు మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ మొత్తం చెల్లించాలని సూచించింది. అలాగే డబ్బు చెల్లించిన రసీదు, మెడికల్ రిపోర్టులు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను ఈనెల 25లోపు ఇవ్వాలని హజ్ కమిటీ ఛైర్మన్ సయ్యద్ గులామ్ అఫ్జల్ బియాబని తెలిపారు. హజ్ యాత్రికులు సాధ్యమైనంత త్వరగా ఫీజు చెల్లించాలని కోరారు.
News August 19, 2025
HYD: లిబర్టీ వద్ద గంజయితో దొరికారు..!

HYD ట్యాంక్ బండ్ పరిధి లిబర్టీ T జంక్షన్ దగ్గర సురజ్ ట్రావెల్స్ ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని దోమలగూడ పోలీసులు పట్టుకుని తనిఖీ చేశారు. వారిని గంజాయి పెడ్లర్లుగా గుర్తించి, అరెస్ట్ చేశారు. వారి నుంచి 18 కిలోల గంజాయి, 2 సెల్‌ఫోన్లను సీజ్ చేశారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన కోమల్ సోమినాథ్ పవార్(23), సాహిల్ మహేశ్ సలున్కే(18) అరెస్టవగా విజయవాడకు చెందిన మరో నిందితుడు బాబు పరారయ్యాడు.