News May 23, 2024

హైదరాబాద్‌లో విషాద ఘటన

image

HYDలో విషాద ఘటన జరిగింది. దుండిగల్ SIరాజేశ్ తెలిపిన వివరాలు..బిహార్‌కు చెందిన రాహుల్, ప్రీతి(24) దంపతులు HYD‌కు వలసొచ్చి బహదూర్‌పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో ఉంటున్నారు. వీరికి కుమార్తె ఉంది. ఈక్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా కూతురు చూస్తుండగానే ప్రీతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఏం చేసుకుందో తెలియని ఆ చిన్నారి చాలాసేపు అమ్మని చూస్తూ ఏడవగా స్థానికులు వచ్చి పోలీసులకు విషయం చెప్పారు.

Similar News

News January 29, 2026

రంగారెడ్డి: ‘90001 13667కు సమాచారమివ్వండి’

image

అగ్ని ప్రమాదానికి ఆస్కారం ఉన్న పరిస్థితులుంటే వెంటనే హైడ్రా కంట్రోల్ రూం నంబరు 90001 13667కు ఫోను చేసి సమాచారమివ్వాలని హైడ్రా కమిషనర్ నగర ప్రజలను కోరారు. ఎక్కడ అగ్ని ప్రమాదానికి అవకాశం ఉన్నా లొకేషన్‌తో పాటు వీడియోలు, ఫొటోలు పంపించాలన్నారు. సమాచారం ఇచ్చినవారి వివరాలు గోప్యంగా ఉంటాయన్నారు. నగరంలోని అందరి లక్ష్యం అగ్ని ప్రమాదాలను తగ్గించడమే కావాలని కోరారు.

News January 26, 2026

రంగారెడ్డి: కలెక్టరేట్‌లో ఏర్పాట్లు అధ్వానం

image

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులు పలు సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో జనాలు హాజరయ్యారు. కానీ ఏర్పాట్లు మాత్రం అధ్వానంగా ఉన్నాయని వచ్చిన వారు మండిపడుతన్నారు. కూర్చునేందుకు కుర్చీలు లేకపోవడంతో పసిపిల్లలను ఎత్తుకుని ఎండలో నిలబడ్డారు.

News January 25, 2026

HYD: సాగర తీర విగ్రహాల వెనుక దాగిన చరిత్ర

image

HYD- SECను కలిపే హుస్సేన్‌సాగర్‌కు వెళ్తే వరుసగా కొలువైన 34 మంది మహానీయుల విగ్రహాలపైకి చూపు మళ్లక మానదు. ముందు తరాల వారికి దీని గురించి తెలిసినా.. నేటి తరానికి అదొక ప్రశ్నే. ఈ విగ్రహాలతో వారి గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు ఇక్కడ ఏర్పాటు చేశారు. వీరు ఎవరు? అనే సందేహం అందరి మదిలో మెదులుతోంది. ఈ మహనీయుల వీరగాథ, చరిత్ర చెప్పేందుకు Way2News రోజుక్కొక్కరి స్టోరిని సంక్షిప్తంగా అందిస్తుంది.