News March 28, 2026

హైదరాబాద్‌లో శ్రీరామనవమి వేళ అద్భుత దృశ్యం

image

హైదరాబాద్‌ VSTలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో అద్భుత దృశ్యం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. అంబరాన్ని తాకేలా వెలిసిన రాముడి భారీ కటౌట్ వెనుక ఉగ్రరూపం దాల్చిన ప్రకృతి మెరుపు ఆ వేడుకకు మరింత వెలుగును తెచ్చింది. అల్లకల్లోలమైన ఆకాశం, ఉరుములు మెరుపుల సాక్షిగా కోదండ రాముడు నిశ్చలంగా, ధైర్యంగా నిలబడ్డ దృశ్యం చూసి ప్రకృతి కూడా ఆ రామయ్యకు నీరాజనాలు అర్పిస్తున్నాయా? అన్నట్లు ఉంది.
PIC CRD: @sumanreddy_d

Similar News

News April 5, 2026

HYD: సిటీలో ఫస్ట్ థియేటర్ ఏదో మీకు తెలుసా?

image

మల్టీప్లెక్స్‌ల హవాలో భాగ్యనగర సినిమా చరిత్రకు సజీవ సాక్ష్యంగా ‘యాకుత్ మహల్’ థియేటర్ నిలుస్తోంది. 1930ల్లో నవాబ్‌జాఫర్ నవాజ్‌జంగ్ నిర్మించిన ఈ చారిత్రక వేదికల్లో సాక్షాత్తూ నిజాం ప్రభువులే సినిమాలు వీక్షించారు. ఇప్పటికీ పాతతరం చికాగో ప్రొజెక్టర్లతోనే ఇక్కడ షోలు నడుస్తుండటం విశేషం. అతి తక్కువ టికెట్‌ ధరతో సామాన్యులకు వినోదాన్ని పంచుతూ, ఓటీటీల కాలంలోనూ తన ఉనికిని కాపాడుకుంటుంది.

మెట్రో రెండో దశ విస్తరణపై అనిశ్చితి !

image

హైదరాబాద్ మెట్రో రెండోదశ విస్తరణపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నకు పార్లమెంట్‌లో కేంద్రం సమాధానం ఇచ్చింది. రెండో దశ విస్తరణకు సంబంధించి ఎలాంటి గడువు విధించలేదని స్పష్టం చేసింది. అలాగే మెట్రో ఫేస్-1 స్వాధీనంపై ప్రభుత్వానికి సూచనలు మాత్రమే చేశామని పేర్కొంది. దీంతో అసలు మెట్రో రెండోదశ ఎప్పుడు పూర్తవుందనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.