News January 16, 2026
హైదరాబాద్‌లో AQ @222

HYDలో ఎయిర్ క్వాలిటీ ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో నగరంలో కాలుష్యం పెరుగుతూనే ఉంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్ క్వాలిటీ శుక్రవారం తెల్లవారుజామున గాజులరామరంలో 222కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. గత వారంలో కాస్త మెరుగుపడిన నాణ్యత.. మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరింది.
Similar News
News March 26, 2026
ASF: ఇళ్లలో ఇంధనం నిల్వ చేయవద్దు.. ప్రమాదకరం!

ఆసిఫాబాద్ జిల్లాలో ఇంధన కొరత వదంతులతో ప్రజలు బంకుల వద్ద బారులు తీరుతున్నారు. కొందరు ఏకంగా ఇళ్లలోనే పెట్రోల్, డీజిల్‌ను నిల్వ చేసుకుంటుండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా స్వల్ప వేడికి కూడా ఇంధనం నిప్పంటుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇంధనానికి ఎలాంటి కొరత లేదని, ప్రాణాలను పణంగా పెట్టి నిల్వలు చేయవద్దని జిల్లా అధికారులు స్పష్టం చేశారు.
News March 26, 2026
హార్ముజ్ భారత్‌కు తెరిచే ఉంటుంది: ఇరాన్ విదేశాంగ మంత్రి

హార్ముజ్ ఇండియాకు తెరిచే ఉంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ స్పష్టం చేసినట్లు ఆ దేశ రాయబార కార్యాలయం వెల్లడించింది. భారత్ సహా ఇరాన్ మిత్ర దేశాలైన చైనా, రష్యా, ఇరాక్, పాకిస్థాన్‌కు చెందిన నౌకలకు హార్ముజ్ మీదుగా వెళ్లేందుకు అనుమతించామని తెలిపింది. హార్ముజ్ వెంటనే ఓపెన్ చేయకపోతే తీవ్ర సంక్షోభం తప్పదని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇరాన్ ఈ ప్రకటన చేసింది.
News March 26, 2026
ఆముదాలవలస: నిండు గర్భిణీ ఆత్మహత్య.. బిడ్డను కాపాడిన వైద్యులు

ఆముదాలవలసలోని వెంగళరావు నగర్ కాలనీకి చెందిన యండమూరి అపర్ణ (25) అనే నిండు గర్భిణి బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అపర్ణ మృతి చెందిందని వైద్యులు తెలిపారు. వెనువెంటనే కడుపులో ఉన్న బిడ్డను కాపాడారు. భర్తతో ఉన్న కలహాలే ఆత్మహత్యకు కారణం అని తెలుస్తోంది. బిడ్డ ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స పొందుతుందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.


