News May 2, 2024
హైదరాబాద్‌లో CM రేవంత్ రెడ్డి మార్క్

HYDలో CM రేవంత్ రెడ్డి మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు ఆకర్షితులై ఇప్పటికే 12 మంది BRS కార్పొరేటర్లు హస్తం కండువా కప్పుకొన్నారు. తాజాగా వనస్థలిపురం BJP కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డి రేవంత్ సమక్షంలో పార్టీలోకి చేరారు. MP ఎన్నికల్లో రాజధానిలోని 4 స్థానాల్లో విజయమే లక్ష్యంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న CM చేరికలపైనా దృష్టి పెట్టారు.
Similar News
News September 13, 2025
యాకుత్‌పురా ఘటనకు.. బాధ్యులపై హైడ్రా చర్యలు

యాకుత్‌పురా మౌలకా చిల్కాలోనీ మ్యాన్ హోల్లో చిన్నారి పడిపోయిన ఘటనను హైడ్రా సీరియస్‌గా పరిగణించింది. దీనిపై హైడ్రా క్షుణ్నంగా విచారించింది. బుధవారం సిల్ట్‌ను తొలగించడానికి తెరచిన మ్యాన్ హోల్ మూయకపోవడంతో గురువారం పాఠశాలకు వెళ్తున్న చిన్నారి అందులో పడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో డీఆర్ ఎఫ్ సూపర్‌వైజర్లు ఇద్దరికి డిమోషన్, ఇద్దరిని తొలగించాలని ఆదేశించింది.
News September 12, 2025
HYD: మిలాద్ ఉన్ నబి వేడుకల్లో డీజేలు నిషేధం

చార్మినార్ PS పరిధిలోని సనా గార్డెన్‌లో మిలాద్ ఉన్ నబీ వేడుకలపై సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డీసీపీ సౌత్ జోన్ ఆధ్వర్యంలో పోలీసులు, జీహెచ్‌ఎంసీ, విద్యుత్, ఆర్&బీ విభాగాల అధికారులు, సుమారు 150 మంది నిర్వాహకులు పాల్గొన్నారు. డీజేలు, పటాకులు నిషేధం అని డీసీపీ స్పష్టం చేస్తూ, కార్యక్రమాలు ప్రశాంతంగా, సమయానికి ముగించాలని తెలిపారు.
News September 12, 2025
GHMC, హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలు

GHMC, హైడ్రాకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు దగ్గర రూ.వంద కోట్ల విలువైన స్థలానికి సంబంధించి వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హౌసింగ్ సొసైటీకి ఆదేశలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.