News April 22, 2025
హైదరాబాద్‌లో CSIR స్టార్ట్‌అప్ కాంక్లేవ్

కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ హైదరాబాద్‌లో CSIR స్టార్ట్‌అప్ కాంక్లేవ్‌ను ప్రారంభించారు. CSIR లాబొరేటరీ IICT, CCMB, NGRI సంయుక్తంగా నిర్వహించిన ఈ కాంక్లేవ్‌లో 70కు పైగా స్టార్టప్‌లు తమ ఆవిష్కరణలు, ఉత్పత్తులు, ప్రదర్శించాయి. పరిశోధన, ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి MP ఈటల రాజేందర్, ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
Similar News
News July 7, 2025
బోనాల ఏర్పాట్లను పరిశీలించిన DCP రష్మీ పెరుమాళ్

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఏర్పాట్లను ఈవో గుత్తా మనోహర్‌రెడ్డితో కలిసి DCP రష్మీ పెరుమాళ్ పరిశీలించారు. ఆలయం లోపల క్యూ లైన్‌లను బోనాలతో వచ్చే మహిళా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. DCPతో పాటు ఏసీపీ సుబ్బయ్య, రామేశ్వర్, కృష్ణ, ప్రకాశ్ తదితరులు ఉన్నారు.
News July 7, 2025
క్రీడల అభివృద్ధిపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

కేంద్ర క్రీడలశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయను సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఖేలో ఇండియా, 40వ నేషనల్ గేమ్స్ వంటి జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలు తెలంగాణకు వచ్చేలా అవకాశాలు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఖేలో ఇండియా పథకం కింద శిక్షణ, వసతుల అభివృద్ధికి నిధులు కేటాయించాలన్నారు. జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు రైల్వే ఛార్జీల్లో రాయితీ మళ్లీ అందించాలని కోరారు.
News July 7, 2025
కాచిగూడ- యశ్వంత్‌పుర వందేభారత్ కోచ్‌ల సంఖ్య పెంపు

కాచిగూడ- యశ్వంత్‌పర వందే భారత్ కోచుల సంఖ్యను రైల్వే శాఖ పెంచింది. ప్రస్తుతం 8 కోచ్‌లు 530 సీటింగ్ కెపాసిటీతో నడుస్తున్న ఈ ట్రైన్ జూలై 10 నుంచి 16 కోచ్‌లు 1,128 సీటింగ్ కెపాసిటీతో పరుగులు పెట్టబోతోంది. ప్రస్తుతం 7 చైర్‌కార్, 1 ఎగ్జిక్యూటివ్ క్లాస్‌తో నడుస్తుండగా ఇకపై 14 చైర్‌కార్, 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.