News December 21, 2025

హైదరాబాద్‌లో DANGER ☠️

image

HYDలో ఎయిర్ క్వాలిటీ డేంజర్ లెవెల్‌కి చేరింది. చలికాలం పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతోంది. డబుల్ డిజిట్‌లో ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ శనివారం 255కి చేరింది. శ్వాసకోస వ్యాధులు, సైనసైటిస్, డస్ట్ అలర్జీ ఉన్నవారు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలు అని డాక్టర్లు సూచిస్తున్నారు. బాలానగర్, సనత్‌నగర్, జీడిమెట్ల, మల్లాపూర్‌లో ఈ సమస్య ఎక్కువగా ఉంది.
SHARE IT

Similar News

News December 21, 2025

నల్గొండ: మీరు మారరా..?

image

ఉమ్మడి జిల్లాపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దృష్టి సారించారు. అవినీతికి అండగా నిలిచే ప్రధాన శాఖలపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఒక్క ఏడాదిలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15కు పైగానే కేసులు నమోదయ్యాయి. బాధితుల నుంచి ఫిర్యాదు వచ్చిన వెంటనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. ఏసీబీ వరుసగా దాడులు చేస్తూ జైలుకు పంపుతున్నా, చాలామంది అధికారుల తీరులో మార్పు రాకపోవడం గమనార్హం.

News December 21, 2025

ఈ నెల 29,30న పరిగిలో జిల్లా సైన్స్ ఫెయిర్

image

ఈనెల 29, 30 తేదీల్లో జిల్లా సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రేణుకాదేవి తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని పరిగి పట్టణంలోని నం.1 ప్రభుత్వ పాఠశాలలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తామని జిల్లాలోని పాఠశాలల విద్యార్థులు సైన్స్ ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. ఇతర వివరాలకు జిల్లా విద్యాధికారి కార్యాలయంలో గానీ జిల్లా సైన్స్ అధికారి విశ్వేశ్వర్‌ని సంప్రదించాలన్నారు.

News December 21, 2025

శ్రీ సత్యసాయి: సైకిల్‌పై అయోధ్యకు సాహస యాత్ర పూర్తి

image

మనోబలం, దైవచింతన తోడైతే ఎంతటి కష్టతరమైన లక్ష్యమైనా అధిగమించవచ్చని బత్తలపల్లి మండలం గంటాపురానికి చెందిన జాంపూల శ్రీనివాసులు నిరూపించాడు. తన గ్రామంలో నిర్మించిన శ్రీరాముని ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవం నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటూ ఆయన చేపట్టిన సుదీర్ఘ అయోధ్య సైకిల్ యాత్ర పూర్తి చేసుకుని గ్రామానికి చేరుకున్నారు. శనివారం గంటాపురానికి చేరుకున్న శ్రీనివాసులకు గ్రామస్థులు శాలువా కప్పి సన్మానించారు.