News March 20, 2025
హైదరాబాద్‌లో OYO 2.O!

HYDలో OYOకు డిమాండ్ పెరిగింది. ఇటీవల సర్వేలోనూ నిజమని తేలింది. పాతబస్తీ గల్లీల నుంచి ORR వరకు ఓయోలే దర్శనమిస్తున్నాయి. చిన్న.. చిన్న లాడ్జీలను సైతం ఆన్‌లైన్‌లో పెడుతున్నారు. రూ.500కే గదులను అద్దెకు ఇవ్వడంతో జనం క్యూ కడుతున్నారు. హోటళ్లు, గదులను లగ్జరీగా డిజైన్ చేసి సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ చిల్ అవ్వాలని యువతను ఆకర్శిస్తున్నారు. దీంతో HYDలో OYO కొత్తపుంతలు తొక్కుతోంది
Similar News
News January 26, 2026
THDCలో 100 అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేశారా?

తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇండియా(THDC)100 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ITI, BE, B.Tech, BBA అర్హతగల అభ్యర్థులు జనవరి 31వరకు NATS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 – 30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తును, డాక్యుమెంట్స్‌ను పోస్ట్ చేయాలి. అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://thdc.co.in
News January 26, 2026
పాల దంతాలకు జాగ్రత్తలు

పసి పిల్లలకు 7-9 నెలల వయసు నుంచి పాలదంతాలు వస్తాయి. ఈ సమయంలో తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. పళ్లు రావడం మొదలయ్యాక మృదువైన బ్రష్‌తో వాటిని శుభ్రం చెయ్యాలి. దురద, నొప్పి రాకుండా శుభ్రమైన క్లాత్‌ని కొంతసేపు ఫ్రిజ్‌లో ఉంచి పిల్లలకు నోట్లో పెట్టుకోవడానికి ఇవ్వాలి. కొంతమందిలో ఈ దంతాలు వచ్చే సమయంలో జ్వరం, మోషన్స్ అవుతాయి. ఇవి ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
News January 26, 2026
HYD: అమ్మాయిలూ.. ఈ NUMBER SAVE చేసుకోండి

మిమ్మల్ని ఎవరైనా వేధిస్తున్నారా..? మౌనంగా భరించకండి. మీకు పోలీసులు అండగా ఉన్నారని చెబుతున్నారు హైదరాబాద్ సీపీ సజ్జనార్. ఆడపిల్లలను ఎవరు వేధించినా కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇస్తున్నారు. నిందితులకు భయపడకుండా వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలని, బాధితుల వివరాలు సీక్రెట్‌గా ఉంచుతామని తెలిపారు. 9490616555 నంబరుకు వాట్సప్ ద్వారా లేదా, 100కు డయల్ చేసినా క్విక్ రెస్పాన్స్ ఉంటుందంటున్నారు. SHARE IT.


