News April 14, 2024
హైదరాబాద్‌లో SUMMER CRICKET

క్రికెట్ ప్లేయర్లకు HCA శుభవార్త చెప్పింది. ఈనెల 20న HYDలో సమ్మర్ క్యాంప్ మొదలుపెడుతామని సంస్థ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు తెలిపారు. ఉచితంగానే ఈ క్యాంప్ కొనసాగిస్తామన్నారు. ఏప్రిల్ 15 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. కేంద్రాల వివరాలు: హైదరాబాద్: జింఖానా: 90301 30346 ఫలక్‌నుమా: 98852 95387 అంబర్పేట్: 98665 82836 లాలాపేట్: 99664 62667 మాదాపూర్: 80195 35679 SHARE IT
Similar News
News September 12, 2025
HYD: అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్: దానం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అధిష్ఠానం నిర్ణయించిన వ్యక్తి గెలుపు కోసం కృషి చేస్తామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. మీరు పోటీ చేస్తారని, మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న ప్రచారంపై మీడియా ప్రతినిధులు అడగగా.. అవన్నీ ఊహగానాలు కావచ్చని అన్నారు. అయితే అధిష్ఠానం నిర్ణయం మేరకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక ఉంటుందని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడం ఎంతో అవసరమని దానం అన్నారు.
News September 12, 2025
గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ వాణి

గాంధీ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్‌గా అడిషనల్ డీఎంఈ డాక్టర్ వాణిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు సూపరింటెండెంట్‌గా పనిచేసిన డాక్టర్ రాజకుమారిని ఫిజియాలజీ ప్రొఫెసర్‌గా బదిలీ చేశారు. ఆసుపత్రి సిబ్బంది నుంచి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
News September 9, 2025
ఉమ్మడి RR ఏఎంసీ ఛైర్మన్ల గౌరవ అధ్యక్షుడిగా పెంటయ్య

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏఎంసీ ఛైర్మన్ల గౌరవ అధ్యక్షుడిగా చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పెంటయ్య గౌడ్ ఎన్నికయ్యారు. పలు మండలాల ఏఎంసీ ఛైర్మన్లు ఆయనను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. తనను ఏకగ్రీవంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏఎంసీ ఛైర్మన్ల గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు వారందికీ ధన్యవాదాలు తెలిపారు.