News May 30, 2024
హైదరాబాద్ ఆస్పత్రులకు వస్తున్నారు..!

అంతర్జాతీయ, జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఆసుపత్రులు HYDలో అధికంగా ఉండటంతో విదేశీయులు, ఇతర రాష్ట్రాల వారు వరుస కడుతున్నారు. ఈస్ట్ ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, దక్షిణాసియా సహా భారత్‌లోని పలు రాష్ట్రాల నుంచి అత్యధికంగా వైద్యం కోసం పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే నగరంలో తక్కువకే వైద్య సేవలు అందుతుండటం కూడా కారణం. ఉస్మానియా, గాంధీ, MNJలో వైద్య సేవలు పొందుతున్నారు.
Similar News
News September 15, 2025
దానం రాజీనామాకు ముందు జూబ్లీ ప్లాన్!

MLA దానం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రయత్నాలు ముమ్మరం చేశారు. AICC కీలక నేతతో టికెట్ కోసం ఒత్తిడి తెస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో దానం నాగేందర్‌కు ప్రమాదం పొంచి ఉంది. ఆయన కాంగ్రెస్ గుర్తుపై ఎంపీగా పోటీ చేయడంతో ఫిరాయింపు స్పష్టం కానుంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో దానంను రాజీనామా చేయించాలని ఇటీవల CM, స్పీకర్, PCC చీఫ్ చర్చించారు. ఇక దానం జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
News September 15, 2025
HYDలో విషాదం నింపిన వర్షం.. ముగ్గురి గల్లంతు

నగరంలో ఆదివారం కురిసిన కుండపోత వర్షంలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. హబీబ్‌నగర్‌లో మామ రామ, అల్లుడు అర్జున్ వరదల్లో కొట్టుకుపోయారు. మామను కాపాడబోయి అల్లుడు కూడా గల్లంతయ్యాడు. ఇక ముషీరాబాద్ వినోదనగర్‌లో యువకుడు సన్నీ నాలాలో పడిపోయాడు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, GHMC, HYDRA బృందాలు గాలింపు చర్యలను ప్రారంభించాయి. ప్రమాదాలు జరిగిన ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News September 14, 2025
గచ్చిబౌలిలో గోడ కూలి ఒకరు మృతి.. నలుగురికి గాయాలు

గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని వట్టినాగులపల్లిలో ప్రమాదం జరిగింది. గోడ కూలి ఒకరు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. స్థానికంగా కొత్తగా నిర్మిస్తున్న నూతన కన్వెన్షన్ సెంటర్‌కి చెందిన ప్రహరీ కూలి అక్కడే పని చేస్తున్న కూలీలపై పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.