News September 12, 2025

హైదరాబాద్: ఇది కదా.. రాజకీయం అంటే!

image

మీరు పార్టీ మారారు అని BRS కోర్టు మెట్లెక్కితే.. మేమెక్కడ మారాం.. కేవలం అభివృద్ధి పనుల కోసమే CMను కలిశాం అని ఆ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. శేరిలింగంపల్లి MLA గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తాము పార్టీ మారలేదని స్పీకర్‌కు సమాధానమిచ్చారు. అంటే.. నాయకులకు పార్టీ కంటే పదవే ముఖ్యమని, పదవి ఉంటుందంటే ఏ పార్టీలో అయినా ఉంటారనే కదా దీనర్థం. ఇదికదా రాజకీయం అంటే అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Similar News

News September 12, 2025

గాంధీ ఆస్పత్రిలో బాధ్యతలు స్వీకరించిన డా.వాణి

image

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా అడిషనల్ DME ప్రొ.డా.వాణి కాసేపటి క్రితం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు పని చేసిన డా.రాజకుమారి గాంధీ మెడికల్ కాలేజీ ఫిజియాలజీ ప్రొఫెసర్‌గా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా డా.వాణి మాట్లాడుతూ.. గాంధీలో సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు.

News September 12, 2025

HYD: పార్టీ మారిన MLAలపై KTR కామెంట్స్

image

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేటీఆర్ కామెంట్స్ చేశారు. పార్టీ మార్చిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేను రాహుల్ గాంధీతో సహా అనేక మంది కాంగ్రెస్ నేతలు స్వయంగా కలిశారని గుర్తు చేశారు. వారితో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో చూపించి, ఇవ్వాళ వీళ్లను మీరు గుర్తుపట్టగలరా? అని ఎద్దేవా చేశారు. BRS టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌లో చేరలేదు అంటున్నారన్నారు.

News September 12, 2025

HYD: గ్రూప్-1పై BJP మౌనమేల: కేటీఆర్

image

సీఎం రేవంత్ రెడ్డి, BJP మ‌ధ్య ర‌హ‌స్య మైత్రి కొన‌సాగుతుందని కేటీఆర్ తీవ్ర‌స్థాయిలో నిప్పులు మండిపడ్డారు. చోటే భాయ్‌కి చీమ కూడా కుట్టకుండా బ‌డే భాయ్ పార్టీ బీజేపీ ప‌హారా కాస్తుంద‌ని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఎన్ని సమస్యలొచ్చినా.. రేవంత్ ఎన్ని స్కాములకు పాల్పడినా, బీజేపీ మాత్రం నొరుమెదపదెందుకు అని అన్నారు.