News September 8, 2025
హైదరాబాద్ ఇమేజికి.. డ్యామేజీ?

ఫార్మా రంగ ఉత్పత్తులలో హైదరాబాద్‌దే అగ్రస్థానం. దాదాపు 40% ఉత్పత్తులు సిటీలోనే తయారవుతున్నాయి. ఇటీవల ఓ ఫార్మా కంపెనీలో నిషేదిత డ్రగ్స్ తయారవుతున్న విషయం బయటికి రావడంతో తీవ్ర చర్చనీయాంశం అయింది. కిలోల కొద్దీ డ్రగ్స్ ఇక్కడే తయారవుతుండటం నగరవాసులను షాకింగ్‌కు గురిచేసింది. ఫార్మా కంపెనీ ముసుగులో కొందరు అక్రమార్కులు డ్రగ్స్ తయారు చేస్తుండటంతో సిటీ ఇమేజీ డ్యామేజీ అయ్యే అవకాశం ఉందని పలువురు వాపోతున్నారు.
Similar News
News September 9, 2025
HYD: అలా అయితే.. నిజంగా ఇది ‘భాగ్య’నగరమే.. !

మహానగర విస్తరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా మెట్రోను ప్రజలకు మరింత చేరువ చేయాలని భావిస్తోంది. 2050 నాటికి 31 రూట్లలో 662 KM మెట్రో రైళ్లు నడపాలని ముసాయిదా సిద్ధమైంది. నిజంగా ఇది అమలైతే.. నగర వాసికి ట్రాఫిక్ చిక్కులు తప్పినట్టే. త్వరలో 200 కిలోమీటర్లు, భవిష్యత్తులో 662 కిలోమీటర్ల మెట్రో అందుబాటులోకి వస్తే నిజంగా ఇది ‘భాగ్య’నగరమే అవుతుంది.
News September 9, 2025
హైదరాబాద్‌లో పోలీస్ క్రికెట్ స్టేడియం..!

హైదరాబాద్ నగరంలో పోలీసుల ఆధ్వర్యంలో కొత్త క్రికెట్ స్టేడియం రానుంది. పోలీస్ క్రికెట్ స్టేడియం (పీసీఎస్) నిర్మాణంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. దీని కోసం అంబర్‌పేట, ఆరాంఘర్ ప్రాంతాల్లో ప్రభుత్వం స్థలం కేటాయించింది. అయితే ఆరాంఘర్‌లో స్టేడియం నిర్మిస్తే మరింత అనుకూలంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పీసీఎస్‌ను క్రికెట్ ఆడుకునే వారికి అద్దెకు ఇవ్వాలని కూడా యోచిస్తున్నారు.
News September 9, 2025
మాజీ సీఎం కలను రేవంత్ రెడ్డి నెరవేర్చాలి: రాజాసింగ్

హుస్సేన్‌సాగర్‌లోకి మురుగునీరు రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. మాజీ సీఎం కేసీఆర్ హుస్సేన్‌సాగర్‌ను కొబ్బరినీళ్లతో నింపుతామన్న కలను రేవంత్ రెడ్డి నెరవేర్చాలన్నారు. డ్రైనేజీ వ్యవస్థను వేరే చోటికి తరలిస్తే సాగర్‌ను మంచినీటితో నింపవచ్చని సూచించారు.