News October 20, 2025
హైదరాబాద్ ఊపిరిపీల్చుకో..!

పండగలొస్తే నగరం కొత్తగా కనిపిస్తుంది. బహుశా ఇలా అనుకుంటుందేమో? ఉదయాన్నే హారన్‌ల మోతలేక హాయిగా నిద్రలేచి సరికొత్త సూర్యోదయం చూశా. బండ్లు ఎక్కువగా తిరగక, కంపెనీలన్నీ బంద్ అవ్వడంతో స్వచ్ఛమైన గాలి గుండెల నిండా పీల్చుకుంటున్నా. మెట్రో, బస్సుల్లో తిట్ల దండకాలు లేవు. ఉరుకులు పరుగులతో ప్రశాంతతలేని ముఖాలు కానరాలేదు. ఇలాంటి పండగల రోజు మళ్లా ఎన్నిరోజులకో..? అని ఎదురుచూస్తున్నట్లు మీకూ అనిపిస్తోందా!
Similar News
News October 20, 2025
కూతుళ్లు అలా చేస్తే కాళ్లు విరగ్గొట్టాలి: ప్రజ్ఞా ఠాకూర్

భోపాల్(MP) మాజీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘హిందూయేతర పురుషుడి వద్దకు మనమ్మాయి వెళ్తానంటే కాళ్లు విరగ్గొట్టాలి. మన విలువలు పాటించని వారికి క్రమశిక్షణ నేర్పాలి. పిల్లల భవిష్యత్ కోసం కొట్టినా ఫరవాలేదు. ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి వచ్చిందని సంతోషపడతాం. కానీ పెద్దయ్యాక ఇతర మతస్థుడి ఇంటికి భార్యగా వెళ్తుంది. అలా జరగకుండా చూడాలి’ అని ఓ రిలీజియస్ ఈవెంట్లో సూచించారు.
News October 20, 2025
KNR: దీపావళి.. ఈ PRECAUTIONS మస్ట్..!

దీపావళి పండగ సందర్భంగా పటాకులు కాల్చే సమయంలో ప్రజలు కచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించాలని ఆయా జిల్లాల అధికారులు సూచిస్తున్నారు.
* టపాసులు కాల్చే టైంలో కాటన్ దుస్తులు ధరించాలి.
* ముఖం దగ్గరగా పెట్టి టపాసులు పేల్చవద్దు.
* మీ పిల్లల పక్కన మీరు విధిగా ఉండండి.
* పేలని టపాసులను మళ్లీ కాల్చడానికి ప్రయత్నించకండి.
* బయట నీటి బకెట్లు పెట్టుకోండి.
* ఎమర్జెన్సీలో దగ్గర్లోని క్లినిక్లకు వెళ్లండి.
SHARE IT.
News October 20, 2025
జనగామ: నందన్ ఫంక్షన్ హాల్లో మద్యం టెండర్ల లక్కీ డ్రా

మద్యం టెండర్ల గడువు పొడిగించడంతో జనగామ జిల్లాలో మద్యం టెండర్లకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈనెల 23 వరకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రోహిబిషన్, ఎక్సైజ్ శాఖ అవకాశం కల్పించింది. అయితే ఈ టెండర్లను లక్కీ డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. జనగామ శివారులోని నందన్ ఫంక్షన్ హాల్లో కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా తీయనున్నారు.