News December 28, 2025
హైదరాబాద్ కుర్రాడే హిమాలయ శిఖరం!

ఒక్కసారి ఊహించుకోండి.. 16 ఏళ్ల వయసులో మనం ఏం చేస్తాం? కానీ మన హైదరాబాద్ కుర్రాడు విశ్వనాథ్ కార్తికేయ మాత్రం ఏకంగా ప్రపంచాన్నే తన పాదాక్రాంతం చేసుకున్నాడు. ఏడు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించి (7 Summits Challenge), ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025’ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నాడు. క్రమశిక్షణతో 2025 మే 27న ఎవరెస్టును ముద్దాడి ఈ ఘనత సాధించాడు.
Similar News
News January 1, 2026
HYDలో కొత్త ట్రెండ్.. ఇదే బెస్ట్ స్పాట్..!

HYDలో ఏ వేడుక జరిగినా ఇప్పుడు అందరి చూపు డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ సెక్రటేరియట్ వైపే ఉంటోంది. IPLలో RCB విజయం, న్యూ ఇయర్ వేడుకలను సీపీ సజ్జనార్ ఇక్కడే జరుపుకోవటం విశేషం. సెక్రటేరియట్ అద్భుతమైన నిర్మాణ శైలి, విద్యుత్ వెలుగులతో ఈ ప్రాంతం పర్యాటకానికి ‘బెస్ట్ స్పాట్’గా మారింది. అమరజ్యోతి, భారీ అంబేడ్కర్ విగ్రహం, హుస్సేన్ సాగర్ అందాలను వీక్షించేందుకు సందర్శకులు పోటెత్తుతున్నారు.
News January 1, 2026
BREAKING.. RR: గురునానక్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. కాలేజీ హాస్టల్‌లో బీటెక్ విద్యార్థి రాము (20) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురునానక్ కాలేజీలో రాము బీటెక్ ఫస్టియర్ చదువుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 1, 2026
చందన్వెల్లి చౌరస్తా.. ప్రపంచపు డిజిటల్ గల్లా పెట్టె!

వాట్సాప్ స్టేటస్ పెట్టినా, నెట్‌ఫ్లిక్స్‌లో మూవీ చూసినా ఆ డేటా వచ్చి చేరే ‘ప్రపంచపు డిజిటల్ లాకర్’ మన చేవెళ్లలో ఉంది. చందన్వెల్లి-షాబాద్ బెల్ట్ ఇప్పుడు అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలకు అడ్డా. గ్లోబల్ కంపెనీలు ₹లక్షల కోట్లు కుమ్మరిస్తున్నాయి. RRR కనెక్టివిటీ తోడైతే ఇండియాకే ‘డిజిటల్ పవర్ హౌస్’ కానుంది. పొలాలకు C/O అడ్రసైన ప్రాంతం, ఇప్పుడు ప్రపంచపు డేటాకు సెక్యూరిటీ గార్డ్‌లా మారుతోంది.


