News January 31, 2025
హైదరాబాద్ చరిత్రలో నేడు కీలకం!

హైదరాబాద్ అభివృద్ధిలో నేడు కీలకం. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. గోషామహల్‌లో ఉదయం 11.40 గంటలకు CM రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. CM పర్యటన నేపథ్యంలో గోషామహల్‌లోని పోలీస్ గ్రౌండ్స్‌లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 26 ఎకరాల్లో 2 వేల పడకల సామర్థ్యంతో ఈ భవనాన్ని అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్నారు.
Similar News
News September 17, 2025
HYDలో తొలిసారి జాతీయ జెండా ఎగిరిందిక్కడే

దేశవ్యాప్తంగా 1947 AUG 15 నుంచి జాతీయ జెండాలు స్వేచ్ఛగా రెపరెపలాడుతున్న సమయంలో నిజాం ప్రభుత్వం నిరంకుశత్వంలో HYDలో ఎగరనివ్వలేదు. ఏడాది తర్వాత వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా 1948 SEP 17న తొలిసారిగా సికింద్రాబాద్ బొల్లారం రాష్ట్రపతి నిలయంలో జాతీయ జెండా అధికారికంగా రెపరెపలాడి హైదారబాదీల స్వాతంత్య్ర కాంక్షను నెరవేర్చింది. అప్పుడు నిర్మించిన జెండా దిమ్మెను నేటికీ ప్రదర్శనకు అలాగే ఉంచారు.
News September 17, 2025
తెలంగాణ చరిత్రను BJP వ్యతిరేకిస్తోంది: కవిత

తెలంగాణ జాగృతి కార్యాలయంలో SEP 17 తెలంగాణ విలీన దినోత్సవమేనని కవిత అన్నారు. తెలంగాణ చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని, మతవిద్వేషాలను రెచ్చగొడుతోందన్నారు. తెలంగాణ విలీనంలో కాంగ్రెస్ చేసిందేమీ లేదని కవిత అన్నారు. మోదీపై ప్రేమ లేకపోతే ఆ పార్టీ దుష్ప్రచారం ఆపాలని.. కేంద్రానికి సీఎం రేవంత్ లేఖ రాయాలన్నారు.
News September 17, 2025
HYD: దక్కన్ రేడియోలో నిజాం ఏం చెప్పారంటే?

‘నా ప్రియమైన ప్రజలారా హమ్ నే భారత్‌కే సదర్ గవర్నర్ జనరల్ రాజగోపాల చారి గారికి పంపుతున్న సందేశం ఏమిటంటే.. నా రాజీనామా సమర్పించడంతోపాటు రజాకారులను నిషేధించమని కోరుతూ HYD సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంటూ ఇస్తున్న సందేశం. ఇకనుంచి ఇక్కడి ప్రజలు భారత ప్రజలతో కలిసి కులమతాలకు అతీతంగా సుఖ సంతోషాలతో భేద భావాలు లేకుండా సామరస్యంగా ఒకే తాటిపై జీవించాలని కోరుతున్నా’ అని ప్రసంగించారు.