News March 2, 2026

హైదరాబాద్: జలమండలిలో ఇక ‘ఈ-ఆఫీస్’ పాలన

image

జలమండలిలో పారదర్శకత కోసం ఎండీ అశోక్ రెడ్డి ‘ఈ-ఆఫీస్’ వ్యవస్థను ప్రారంభించారు. ఇకపై అన్ని విభాగాల్లో భౌతిక ఫైళ్లకు స్వస్తి పలికి, డిజిటల్ విధానంలోనే కార్యకలాపాలు నిర్వహించనున్నారు. దీనివల్ల ఫైళ్ల కదలికను ట్రాక్ చేస్తూ సత్వర నిర్ణయాలు తీసుకునే వీలుంటుంది. తొలుత ప్రధాన కార్యాలయంలో, అనంతరం అన్ని డివిజన్లలో ఈ విధానం అమలు కానుంది.

Similar News

News April 5, 2026

భీమవరం కలెక్టరేట్‌లో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి

image

భీమవరం కలెక్టరేట్‌లో ఆదివారం బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, కుల రహిత సమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

News April 5, 2026

ఏలూరులో జగ్జీవన్ రామ్ జయంతి

image

ఏలూరు జిల్లా కేంద్రంలోని గౌతమి సమావేశ మందిరంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ విశ్వమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ మాజీ ఉప ప్రధానిగా, సంఘ సంస్కర్తగా జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

News April 5, 2026

తిరుపతి: దరఖాస్తుల గడువు పొడిగింపు

image

ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి IITలో 2026 సంవత్సరానికి Ph.D/ M.S(Research) ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పొడిగించినట్లు కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. అర్హత, ఇతర వివరాలకు https://www.iittp.ac.in/admissions వెబ్ సైట్ చూడాలి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 13.