News May 8, 2024
హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

> చందనగర్ లో 24 గంటలుగా కరెంట్ లేదని బస్తీ వాసుల ఆందోళన
> కాచిగూడలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
> నల్లగుట్టలో మహిళలపై దాడి.. జైలు శిక్ష
> గుడిమల్కాపూర్‌లో కిషన్ రెడ్డి ప్రచారం
> కూకట్‌పల్లిలో సహాయక చర్యలను పరిశీలించిన జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్
> గచ్చిబౌలి, నల్లగండ్ల పార్కుల్లో విరిగిపడ్డ చెట్లు
> నగరంలో జోరుగా ఎన్నికల ప్రచారం
Similar News
News September 13, 2025
HYD: ఫోన్‌కు APK ఫైల్.. నొక్కితే రూ.95,239 మాయం

హైదరాబాద్‌లో టైలర్‌కు RTO CHALLAN పేరిట APK ఫైల్ వచ్చింది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే అకౌంట్ నుంచి రూ.95,239 మాయమయ్యాయి. సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ డేటా దొంగిలించి ఆన్‌లైన్ ఆర్డర్ చేశారు. బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా డబ్బు తిరిగి వచ్చేలా చేశారు. ఇలాంటి APK ఫైల్‌తో మెసేజ్ వస్తే క్లిక్ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు.
News September 13, 2025
HYD: పెళ్లి సంబంధాల పేరుతో రూ.25 లక్షల మోసం.. అరెస్ట్

పెళ్లి సంబంధాలు చూస్తామని మ్యాట్రిమోనీ వెబ్ సైట్‌లో మోసం చేసిన అనీశ్(33)ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ వీడియో కాల్స్ చేయించి, మెప్పించి, చివరికి అకౌంట్‌లో నుంచి రూ.25 లక్షలు కాజేసినట్లు ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. పోలీసులు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకున్నారు.
News September 13, 2025
HYD: నిర్లక్ష్య రైడింగ్ ప్రాణాన్ని బలిగొంది..!

ఘట్‌కేసర్ పరిధి అన్నోజిగూడలో నిర్లక్ష్య రైడింగ్ ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. విధులకెళ్తున్న 57 ఏళ్ల ఎలక్ట్రీషియన్ చంద్రారెడ్డిని ఓ మైనర్ బాలుడు నిర్లక్ష్యంగా బైక్ నడిపి, ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. బైక్ నడిపిన 16 ఏళ్ల బాలుడితోపాటు, వాహన యజమాని అయిన అతడి తల్లిపై కేసు నమోదు చేశారు. మైనర్లకు వాహనాలు ఇస్తే పేరెంట్స్‌పై కేసులు నమోదు చేస్తామన్నారు.