News July 15, 2024
హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

> ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి> కన్నుల పండువగా జగన్నాథుడి రథయాత్ర> బోడుప్పల్ నూతన మేయర్‌గా తోటకూర అజయ్ యాదవ్> బాలాపూర్‌లో ప్రయాణిస్తున్న కారులో చెలరేగిన మంటలు> రాజేంద్రనగర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత > ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సెక్రటేరియట్ ముట్టడి> గచ్చిబౌలి DLF వద్ద అగ్ని ప్రమాదం > దుండిగల్‌లో 3.8 కిలోల గంజాయి సీజ్
Similar News
News August 5, 2025
నాగరం: పోలీసులపై హైకోర్టు సీరియస్

నాగారంలోని భూదాన్ భూములపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. పోలీసులు బెదిరిస్తున్నారని పిటీషనర్ రాములు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. భూదాన్ భూములపై పిటీషన్ ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. కానిస్టేబుల్‌ను కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించగా హాజరైన కానిస్టేబుల్ వేంకటేశ్వర్లు, సీఐ వేంకటేశ్వర్లు చెప్పినందుకే ఫోన్ చేసినట్లు తెలిపారు. మరోసారి రిపీట్ కావద్దని హైకోర్టు తెలిపింది.
News August 5, 2025
HYDలో వరదముప్పుపై అధికారులు ALERT

మహానగరంలో ఈ రోజు కూడా వర్షం పడే అవకాశాలుండటంతో గ్రేటర్, హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఉన్నతాధికారులు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ప్రజలు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా నగరంలో ఎక్కడైనా వరదముప్పు ఉంటే హైడ్రా కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని హైడ్రా కమిషనర్ తెలిపారు. 9000113667 నంబరుకు ఫోన్ చేయాలన్నారు.
News August 5, 2025
HYD: BC రిజర్వేషన్లకు దీక్ష చేయాలి: తీన్మార్ మల్లన్న

సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావులకు చిత్తశుద్ధి ఉంటే 42% బీసీ రిజర్వేషన్ల కోసం దీక్ష చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. ఈ విషయమై అన్ని పార్టీలు బీసీల నినాదాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. రిజర్వేషన్లకు అడ్డు ఎవరూ లేరని, కానీ ఈ 3 పార్టీలు నయానాటకానికి తెరతీస్తున్నాయన్నారు.