News March 30, 2024
హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

> కాంగ్రెస్ పార్టీలో చేరిన GHMC మేయర్
> సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద డీజిల్ పోసుకొని ఓ వ్యక్తి హల్‌చల్ > లంచం తీసుకుంటూ దొరికిన మీర్‌పేట SI
> HYD ఎన్నికల అధికారులకు కాంప్రహెన్సివ్ ట్రైనింగ్
> టెట్ ఫీజు తగ్గించాలని ఓయూలో విద్యార్థులు డిమాండ్
> నల్లగండ్ల చెరువును పరిశీలించిన GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్
> త్యాగరాయగానసభలో ఆకట్టుకున్న గానవిభావరి
> OYO హోటల్‌లో యువతిపై అత్యాచారం
Similar News
News September 7, 2025
HYD: గంగ ఒడికి చేరిన చిట్ట చివరి గణపతి ఇదే!

ట్యాంక్‌బండ్ వద్ద గణేశ్ నిమజ్జన వేడుకలు ఆదివారం సాయంత్రం పూర్తయ్యాయి. GHMC ఆధ్వర్యంలో ప్రత్యేక క్రేన్లను అధికారులు ఏర్పాటు చేశారు. పకడ్బందీ ఏర్పాట్లతో కార్యక్రమం ప్రశాంతంగా ముగిసిందని పోలీసులు తెలిపారు. ‘చివరి గణేశ్ విగ్రహ నిమజ్జనం విజయవంతంగా పూర్తయింది. ట్రాఫిక్ నిర్వహణ సజావుగా సాగేలా సహకారం అందించిన పౌరులకు కృతజ్ఞతలు’ అంటూ పోలీసులు ట్వీట్ చేశారు. గంగ ఒడికి వచ్చిన చివరి గణపతితో ఫొటోలు దిగారు.
News September 7, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పోలింగ్ కేంద్రాల్లో మార్పులు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో అధికారులు పోలింగ్ స్టేషన్లలో కొన్నింటిని మార్చారు. బోరబండ ఎన్ఆర్ఆర్‌పురంలోని రెండు అదనపు బూత్‌లను సాయిబాబానగర్ ప్రభుత్వ స్కూల్‌కు మార్చారు. ఎల్లారెడ్డిగూడ రేడియంట్ స్కూల్లోని అదనపు కేంద్రాన్ని పడాల రామిరెడ్డి లా కాలేజీలోకి మార్చారు. అమానత్ పాఠశాలలో అదనపు బూత్‌లు ఏర్పాటు చేశారు. ఆనంద్ విద్యాలయ కిడ్స్ స్కూల్, యూసఫ్‌గూడ వార్డు కార్యాలయంలో కేంద్రాలను ఏర్పాటు చేశారు.
News September 7, 2025
HYD: మైనర్ బాలికపై అత్యాచారం

మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన సిటీ శివారులో వెలుగుచూసింది. పోలీసుల వివరాలు.. శనివారం రాత్రి యాచారం మం. పరిధిలోని ఓ గ్రామంలో బాలికకు మాయమాటలు చెప్పిన ఇద్దరు యువకులు గెస్ట్ హౌస్‌కు తీసుకెళ్లారు. ఓ యువకుడు ఆమెపై లైంగికదాడి చేశాడు. మరొకడు అత్యాచారానికి యత్నించాడు. ఆదివారం బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. బాలికను చికిత్స నిమిత్తం సిటీలోని ఓ ఆస్పత్రికి తరలించారు.