News February 6, 2026

హైదరాబాద్‌ తాజ్‌మహల్‌ గురించి తెలుసా?

image

HYD అంటేనే సకల కళల సమ్మేళనంగా వెలుగొందే మహానగరం. వందల ఏళ్ల కట్టడాలకు తార్కాణం. అందులో ప్రత్యేక కళాఖండంగా నిలిచేది ‘పైగా టూంబ్స్‌’. ఈ పాలరాతి నిర్మాణం ప్రశాంతతను పంచుతుంది. అద్భుత ఆర్కిటెక్చర్‌ మంత్రముగ్ధులను చేస్తోంది. దక్షిణ తాజ్‌మహల్‌గా పేరుగాంచింది. వీటిని 1786లో పైగా వంశానికి చెందిన అమీర్-ఎ-కబీర్‌ పిసల్ బండలో ప్రారంభించారు. ఇక్కడ 32 విలాస సమాధులు ఉన్నాయి. ‘పైగా’ అనేది నిజాంలు ఇచ్చిన బిరుదు.

Similar News

News February 7, 2026

బిచ్కుంద: పూరి గుడిసె వాసికి అధికార పార్టీ టికెట్

image

బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. పూరి గుడిసెలో నివసించే దళిత మహిళ హన్మవ్వకు కాంగ్రెస్ బీఫాం దక్కంది. హన్మవ్వ భర్త గంగారం 40 ఏళ్ల పాటు పార్టీలో కార్యకర్తగా సేవలందించారు. ఆయన ఇటీవల మృతి చెందారు. అతని సేవలను గుర్తించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గంగారం భార్యకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు.

News February 7, 2026

కాకినాడ: అధిక ధరలకు మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు- కలెక్టర్

image

మద్యం షాపుల్లో ప్రభుత్వం నిర్ణయించిన MRP కంటే ఒక్క రూపాయి ఎక్కువకు అమ్మినా లైసెన్సులు రద్దు చేస్తామని కలెక్టర్ షణ్మోహన్ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎస్పీ బిందు మాధవ్‌తో కలిసి ఎక్సైజ్ అధికారులు, లైసెన్సీలతో సమావేశం నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రతి దుకాణం వద్ద ధరల పట్టిక ప్రదర్శించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

News February 7, 2026

KMR: ప్రచారానికి మిగిలింది మూడు రోజులే!

image

కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి 3 రోజుల్లో తెరపడనుంది. సోమవారం సాయంత్రం 5గం.లోపు బరిలోని అభ్యర్థులు ప్రచారాన్ని ముగించాల్సి ఉంటుంది. కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో అనుకున్న స్థాయిలో ప్రచారం జరగలేదనేది ఆయా వార్డుల్లో ప్రజలు చర్చించుకుంటున్నారు. సైలెంట్ ఓటింగ్‌పైనే అభ్యర్థులు ఆధారపడ్డట్లు కనిపిస్తుంది. సిట్టింగ్లు బెట్టుగా గెలవాలనే ఉత్సాహంలో ఉన్నారు.