News December 13, 2025

హైదరాబాద్ దూరదర్శన్‌ కేంద్రంలో ఉద్యోగాలకు అప్లై చేశారా?

image

హైదరాబాద్ <>దూరదర్శన్<<>> కేంద్రంలో 11 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీటిలో తెలుగు, ఉర్దూ న్యూస్ రీడర్, వీడియో ఎడిటర్, అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్, కాపీ ఎడిటర్, అసిస్టెంట్ వెబ్‌సైట్ ఎడిటర్, బ్రాడ్‌కాస్ట్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. న్యూస్ రీడర్లకు గరిష్ఠ వయసు 40ఏళ్లు కాగా.. మిగతా పోస్టులకు 50ఏళ్లు. వెబ్‌సైట్: https://prasarbharati.gov.in

Similar News

News December 22, 2025

ప్రభుత్వ స్కూళ్లలో ‘నో అడ్మిషన్’ బోర్డు కోసం ఏం మార్చాలి?

image

విద్యారంగంపై పాలకులు ఎన్ని గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉంది. ముఖ్యంగా టీజీలో ప్రభుత్వ పాఠశాలలు పిల్లలు లేక <<18629441>>ఖాళీ<<>> అవుతున్నాయి. మౌలిక సదుపాయాల లోపం, ఆంగ్ల మాధ్యమంపై తల్లిదండ్రుల మొగ్గు, ప్రైవేట్ స్కూళ్ల పోటీయే దీనికి కారణం. ఉపాధి కోసం వలసలు వెళ్లడం, గురుకులాల వైపు విద్యార్థులు మళ్లడంతో పాఠశాలల్లో స్ట్రెంత్ తగ్గిపోతోంది. ఈ పరిస్థితి మారాలంటే ప్రభుత్వం ఏంచేయాలో కామెంట్ చేయండి.

News December 22, 2025

న్యూ మంగళూరు పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్ పోస్టులు

image

<>న్యూ <<>>మంగళూరు పోర్ట్ అథారిటీ 31 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. BE, B.Tech, B.Com, BA, డిప్లొమా అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 29 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు 2022, 2023, 2024, 2025 సంవత్సరంలో ఉత్తీర్ణులై ఉండాలి. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.9వేలు, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8వేలు స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://newmangaloreport.gov.in

News December 22, 2025

మన క్రమశిక్షణ కోసమే ఆయన విలయ తాండవం

image

‘ఓం భీమాయ నమః’ – భీమ అంటే భయంకరమైనవాడని అర్థం. దుష్టులకు, అధర్మానికి శివుడు ప్రళయకాల రుద్రునిలా భయం కలిగిస్తాడు. అయితే ఈ భయం వినాశనం కోసం కాదు! సృష్టిలో క్రమశిక్షణను, ధర్మాన్ని నిలబెట్టడం కోసం. అహంకారాన్ని రూపుమాపడం కోసం. ఆయన సన్మార్గులకు రక్షణ కవచం. చెడు ఆలోచనలు, భయాలు భస్మం చేసే శక్తి ఆ పరమేశ్వరుడు. క్రూరత్వాన్ని అణిచివేసి విశ్వశాంతిని నెలకొల్పే ఆ దైవ బల పరాక్రమాలకు ఈ నామం సూచిక. <<-se>>#SHIVANAMAM<<>>