News August 25, 2025
హైదరాబాద్ నుంచి సరికొత్త టూర్ ప్లాన్స్

HYD నుంచి టూర్ వెళ్లాలనుకునే వారికి తెలంగాణ టూరిజం శాఖ కొత్త ప్యాకేజీలు అందుబాటులోకి తెచ్చింది. నగరం నుంచి అరుణాచలం, బెంగళూరు, అన్నవరం ప్రాంతాలకు వెళ్లడానికి వేర్వేరుగా బస్సులను నడుపుతోంది. బెంగళూరు టూర్ 2 రోజులు, అరుణాచలం టూర్ 3 రోజులు, అన్నవరం ట్రిప్ 4 రోజులు ఉండనుంది. పూర్తి వివరాలకు 98485 40371,98481 25947, 98480 07020 నంబర్లకు కాల్ చేయవచ్చని అధికారులు తెలిపారు.
Similar News
News August 26, 2025
ఎన్టీఆర్, రామ్ చరణ్ మూవీల్లో ఛాన్స్.. శ్రీలీల ఏమన్నారంటే?

ఒకవేళ రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాల్లో ఒకేసారి నటించే అవకాశం వస్తే డై అండ్ నైట్ షిఫ్టులు చేస్తానంటూ హీరోయిన్ శ్రీలీల ఓ టాక్ షోలో చెప్పారు. తనతో కలిసి నటించిన వారిలో హీరో రవితేజ అల్లరి ఎక్కువ చేస్తారని తెలిపారు. సమంత తన ఫేవరెట్ నటి అని, తాను కాకుండా ప్రస్తుతం టాలీవుడ్‌లో డాన్సింగ్ క్వీన్ సాయిపల్లవి అని పేర్కొన్నారు. కాగా రవితేజతో ఈ అమ్మడు నటించిన ‘మాస్ జాతర’ విడుదలకు సిద్ధంగా ఉంది.
News August 26, 2025
ఖానాపూర్: నిస్సహాయ స్థితిలో వ్యక్తి మృతి!

కుటుంబ సభ్యులు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫిట్స్ రావడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన ఖానాపూర్ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. మండలంలోని బండమీది మామిడి తండాకు చెందిన బానోతు శ్రీను(42)కు భార్య, పిల్లలు ఉన్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న శ్రీనుకు మధ్యాహ్నం సమయంలో ఫిట్స్ రావడంతో మృతి చెందాడు. సాయంత్రం స్కూలు నుంచి వచ్చిన పిల్లలు ఎంత పిలిచినా తండ్రి లేవకపోవడంతో, ఇంటి పక్క వారికి సమాచారం ఇచ్చారు.
News August 26, 2025
గాజా ఆసుపత్రిపై దాడి.. ఐదుగురు జర్నలిస్టులు మృతి!

గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. తాజాగా ఓ ఆసుపత్రిపై చేసిన దాడిలో 20 మంది మరణించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. వీరిలో ఐదుగురు జర్నలిస్టులు ఉన్నారని తెలిపింది. రాయిటర్స్, అసోసియేటెడ్ ప్రెస్ వంటి సంస్థలతో కలిసి పనిచేసిన వారు ఉన్నారని వెల్లడించింది. మరోవైపు ఈ దాడులతో తాను సంతోషంగా లేనని యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి అని తుర్కియే దుయ్యబట్టింది.