News May 13, 2024

హైదరాబాద్‌ పరువు తీయకండి.. ఇకనైనా ఓటేయండి!

image

ఏ ఎన్నికలైనా పోలింగ్ శాతంలో రాజధాని మాత్రం చివరిలో నిలుస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో HYDలో 44.84%, మల్కాజిగిరిలో 49.63%, సికింద్రాబాద్‌లో 46.50%, చేవెళ్లలో 53.25% నమోదు కావడం గమనార్హం. పోలింగ్ శాతం పెంచేలా EC అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ప్లే స్టోర్‌లో VOTER HELPLINE యాప్ తీసుకొచ్చారు. ఇప్పుడే డౌన్‌లోడ్ చేసి మీ పోలింగ్ బూత్‌‌ ఎక్కడుందో తెలుసుకోండి. HYD పరువు తీయకండి. ఇకనైనా ఓటేయండి.

Similar News

News October 8, 2024

BREAKING: HYD: నిద్రిస్తున్న భార్య.. దారుణ హత్య!

image

HYD హైదర్షాకోట్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. నిద్రిస్తున్న భార్యను సుత్తితో కొట్టి భర్త శ్రీనివాస్ హత్య చేశాడు. గతకొంత కాలంగా టార్చర్ చేస్తున్నాడని గతంలోనే మృతురాలు పలుమార్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మద్యం మత్తులో భార్యను చంపేసిన శ్రీనివాస్ పిల్లలతో సహా PSకి వెళ్లి లొంగిపోయాడు. స్పాట్‌కి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News October 8, 2024

దసరా: హైదరాబాద్‌ను విడిచి ఊరెళ్లిపోతున్నారు!

image

దసరా పండుగతో నగరం ఖాళీ అవుతోంది. HYD ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సుల కోసం ప్రయాణికులు క్యూ కట్టారు. సద్దుల బతుకమ్మ, దసరా పండుగకు పట్టణం నుంచి పల్లెబాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో MGBS, JBS, ఉప్పల్‌లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నప్పటికీ ప్రయాణికుల సంఖ్యకు సరిపోవడం లేదు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

News October 8, 2024

HYD: రూ.1 కోటి పలుకుతున్న కిలో డ్రగ్

image

తెలంగాణలో బహిరంగ మార్కెట్లో ఎంఫిటమైన్ ముడి ధరలు కిలో రూ.1 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకూ పలుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిమాండ్‌ను బట్టి దళారులు ఈ ధరలను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ ముడి సరుకును ల్యాబ్‌కు తరలించి ఎండీఎం తయారీకి ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. కూకట్‌పల్లిలో ఎంఫిటమైన్ తయారీ చేస్తున్న వారిని అరెస్టు చేయడంతో వివరాలు వెలుగులోకి వచ్చాయి.