News August 24, 2025

హైదరాబాద్ మెట్రోపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

image

హైదరాబాద్ మెట్రో రైలుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త మెట్రో లైన్ వేసేందుకు ఎల్ అండ్ టీ సంస్థకు పెద్దగా ఆసక్తి ఉన్నట్లులేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వం సైతం మరో కంపెనీకి ఈ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోందన్నారు. ఫేజ్-1లోని ఫలక్‌నుమా-అఫ్జల్ గంజ్ రూట్ ఇంకాపూర్తి కాలేదని.. ఈ పనులు పూర్తి అయిన తరువాతే కేంద్రం నుంచి నిధులు వస్తాయన్నారు.

Similar News

News August 24, 2025

మూసీ పరివాహకంలో వ్యక్తి మృతదేహం లభ్యం!

image

అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూసీ పరివాహక ప్రాంతంలో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుడు మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతుడి వివరాలు తెలిస్తే అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్ SHO నంబర్ 8712660590కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.

News August 24, 2025

బీసీ రిజర్వేషన్లు.. గాంధీభవన్ కీలక నిర్ణయం ?

image

రాష్ట్రంలో ఇపుడు ఎక్కడ చూసినా 42 శాతం బీసీ రిజర్వేషన్లపైనే సాగుతోంది. ఈ నేపథ్యంలో జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నిర్ణయంపై కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ సీటును బీసీ అభ్యర్థికి కేటాయించి బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ప్రజలకు చెప్పకనే చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా ఈ విషయంపై పార్టీ అధిష్ఠానం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

News August 24, 2025

HYD: గణపతి సేవలో 25 వేల మంది కార్మికులు

image

వినాయక చవితి అంటేనే పూజలు.. వ్రతాలు..నిమజ్జన కార్యక్రమాలుంటాయి. వీధులు, చెరువుల వద్ద పూజా వస్తువులు, పూలు, ప్రసాదాలు పడేస్తారు. దీంతో ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు జీహెచ్ఎంసీ 25 వేల మంది పారిశుద్ధ్య కార్మికులను రంగంలోకి దింపింది. వీరంతా మూడు షిఫ్టుల్లో విధినిర్వహణలో పాల్గొంటారు. ముఖ్యంగా 29 నుంచి నిమజ్జన వేడుకలు జరుగనుండటంతో చెరువుల వద్ద క్లీనింగ్ కార్యక్రమాలు చేపడతారు.