News March 20, 2025

హైదరాబాద్‌ మెట్రో స్టేషన్లలో రద్దీ

image

సమ్మర్ ఎఫెక్ట్‌తో నగరవాసులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. గురువారం ఉ. అమీర్‌పేట స్టేషన్‌‌కు ప్రయాణికులు క్యూ కట్టారు. ప్లాట్‌ఫాం పూర్తిగా నిండిపోయింది. రాయదుర్గ్ రూట్‌లో వెళ్లేవారికి నిరీక్షణ తప్పలేదు. ట్రైయిన్‌‌లో కిక్కిరిసి ప్రయాణించారు. డ్యూటీకి వెళ్లేవారు అసౌకర్యానికి గురయ్యారు. ఇలా అయితే ఎలా పోవాలి అయ్యా ఆఫీస్‌కి అంటూ ఓ నెటిజన్ @ltmhydని ప్రశ్నించారు. ఇకనైనా సర్వీసులు పెంచాలని కోరుతున్నారు.

Similar News

News February 20, 2026

తెలంగాణ జాతిపిత కేసీఆరే: దాస్యం

image

తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. 60 ఏండ్ల ప్రత్యేక తెలంగాణ కలను సాకారం చేశారని, తెలంగాణ సాధన కోసం గాంధీ మార్గంలో పోరాడారని చెప్పారు. సాధించిన తెలంగాణను అంబేడ్కర్ స్ఫూర్తితో దేశానికి ఆదర్శంగా నిలిపారని, 500కు పైగా సంక్షేమం పథకాలను అమలు చేశారని తెలిపారు. 10 ఏండ్ల బీఆర్ఎస్, కేసీఆర్ పాలనలో సంక్షేమం అభివృద్ధి ప్రజలకు చేరువైందన్నారు.

News February 20, 2026

B.Ed సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ B.Ed మొదటి సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ మేరకు యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారి డాక్టర్ ఉదయ్ భాస్కర్ విడుదల చేశారు. కాగా ఈ పరీక్షలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా వేశారు. దీనితో కొత్త తేదీలను ప్రకటించారు. ఈనెల 24 నుంచి మార్చి 2వ తేదీ వరకు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు జరుగుతాయని తెలిపారు.

News February 20, 2026

తండ్రి హెల్త్ అప్డేట్స్ బయటకు రావడంపై సల్మాన్ అసంతృప్తి

image

సల్మాన్ ఖాన్ తండ్రి, రచయిత సలీమ్ ఖాన్ ఆరోగ్య <<19171270>>పరిస్థితి<<>> విషమంగానే ఉంది. 90 ఏళ్ల ఆయనకు ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. అయితే సలీమ్ హెల్త్ అప్డేట్స్ బయటికి రావడంపై ఆసుపత్రి వర్గాలపై సల్మాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితం ఆయన కుటుంబీకులతో కలిసి హాస్పిటల్‌కు వెళ్లారు. తన తండ్రి హెల్త్ అప్డేట్స్ ఏవీ బయటికి చెప్పొద్దని, ప్రైవసీ మెయింటెన్ చేయాలని సూచించారు.