News January 17, 2026

హైదరాబాద్‌: మ్యూజిక్ లవర్స్‌కు కిరాక్ న్యూస్!

image

‘ఉత్తర దక్షిణ్’ 15వ సీజన్ నగరానికి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 14న సాయంత్రం 6:30 గంటలకు రవీంద్రభారతిలో ఈ స్వర విందు జరగనుంది. హిందుస్థానీ గాత్ర దిగ్గజం పండిట్ జయతీర్థ మేవుండి, కర్ణాటక వేణుగాన విద్వాంసుడు శశాంక్ సుబ్రమణ్యం పోటీపడి వినిపించే ‘జుగల్బందీ’ హైలైట్ కానుంది. తబలాపై వి.నరహరి, మృదంగంపై సతీశ్ పత్రి లయ విన్యాసాలు చేయనున్నారు. బుక్‌మైషోలో టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

Similar News

News February 7, 2026

HYD: తల్లీబిడ్డల ఆత్మహత్య.. చివరి కాల్‌ ఆయనతోనే!!

image

ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడిన విజయ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. చెంగిచర్లలోని ఆమె నివాసాన్ని రైల్వే పోలీసులు తనిఖీ చేశారు. బ్యాంకు పాస్‌ బుక్కులు, చెక్‌ బుక్కులను స్వాధీనం చేసుకున్నారు. లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. ఫోరెన్సిక్ డాటా సేకరించారు. చివరి కాల్ సోదరుడితో సాధారణంగానే మాట్లాడినట్లు తెలిపారు.

News February 7, 2026

HYD: మహిళా ఇంజినీర్లకు బంపర్ ఆఫర్

image

HYD ఐఐఐటీలోని ఐహబ్‌-డేటా మహిళా గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్ల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించింది. (AI), మెషీన్‌ లెర్నింగ్‌ (ML) అంశాలపై 6 నెలల పాటు ఈ శిక్షణ ఇవ్వనున్నారు. మార్చిలో ప్రారంభమయ్యే ఈ కోర్సులో ప్రతి సోమవారం క్యాంపస్‌లో తరగతులు ఉంటాయి. ప్రతిభ కనబరిచిన వారికి మూడు నెలల ఇంటర్న్‌షిప్‌ అవకాశం కల్పిస్తారు. ఫిబ్రవరి 20లోగా https://ihub-data.ai వెబ్‌సైట్‌‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News February 7, 2026

HYDలో బస్ కంటే బండి బెటర్.. మీ కామెంట్?

image

RTC ఛార్జీలపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. SMలో వందల సంఖ్యలో ట్వీట్లు చేస్తున్నారు. ఓ ప్రయాణికుడు RTC బస్సులో పరేడ్ గ్రౌండ్ నుంచి సికింద్రాబాద్ ప్రయాణించాడు. రూ.25 ఛార్జీ వసూలు చేశారని, దీన్ని చూస్తే బస్ కంటే, బండిపై వెళ్లడం మేలు అని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. రామంతాపూర్ టు అంబర్‌పేట రూ.20 తీసుకోవడం అన్యాయం అన్నారు. దీనికంటే మెట్రో బెటర్ అంటున్నారు. దీనిపై మీ కామెంట్?