News January 17, 2026
హైదరాబాద్: మ్యూజిక్ లవర్స్‌కు కిరాక్ న్యూస్!

‘ఉత్తర దక్షిణ్’ 15వ సీజన్ నగరానికి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 14న సాయంత్రం 6:30 గంటలకు రవీంద్రభారతిలో ఈ స్వర విందు జరగనుంది. హిందుస్థానీ గాత్ర దిగ్గజం పండిట్ జయతీర్థ మేవుండి, కర్ణాటక వేణుగాన విద్వాంసుడు శశాంక్ సుబ్రమణ్యం పోటీపడి వినిపించే ‘జుగల్బందీ’ హైలైట్ కానుంది. తబలాపై వి.నరహరి, మృదంగంపై సతీశ్ పత్రి లయ విన్యాసాలు చేయనున్నారు. బుక్‌మైషోలో టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
Similar News
News February 6, 2026
ఎప్‌స్టీన్ బతికే ఉన్నాడా?

ప్రపంచాన్ని కుదిపేస్తున్న అమెరికా సెక్స్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ బతికే ఉన్నాడంటూ SMలో ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో ఉన్న బడా బాబులు తప్పించుకునేందుకు అతడు చనిపోయాడనే కుట్రకు తెరతీసి దేశం దాటించారనే వాదనలు వినిపిస్తున్నాయి. వాటికి ఆధారంగా పేర్కొంటూ కొన్ని వీడియోలు, ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు అతడిది సూసైడ్ కాదని.. కావాలనే హత్య చేశారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.
News February 6, 2026
NLG: ఓట్ల లెక్కింపునకు ర్యాండమైజేషన్

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సిబ్బంది ర్యాండమైజేషన్ కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా ఎన్నికల పరిశీలకులు, రాష్ట్ర ఎస్ సి ఈ ఆర్ టి డైరెక్టర్ జి. రమేష్ సమక్షంలో కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించారు. 270 మంది కౌంటింగ్ స్టాఫ్, 540 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, మొత్తం 810 మంది సిబ్బందికి సంబంధించిన ర్యాండమైజేషన్‌ను నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు.
News February 6, 2026
NZB: అండగా నిలవండి.. ఆదర్శంగా తీర్చిదిద్దుతా: CM

నిండు మనసుతో అండగా నిలిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన నిజామాబాద్ జిల్లా బర్దిపూర్‌లో నిర్వహించిన సభలో మాట్లాడారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. గత 10 ఏళ్ల BRS, 12 ఏళ్ల BJP పాలనలో NZB చెత్త కుప్పలా, మురికి కూపంలా మారిందని విమర్శించారు.


