News April 7, 2024
హైదరాబాద్: రోడ్ల మీద చెత్త వేస్తే FINE
ఇంటింటి చెత్త సేకరణను 100% విజయవంతం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ నగరవాసులకు సూచించారు. స్వచ్ఛ ఆటోలకు చెత్త ఇవ్వకుండా, రోడ్లపై పడేస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు. వారం రోజుల బస్తీ కార్యాచరణతో సాధ్యమైన ఫలితాలను వివరిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. క్షేత్రస్థాయి సమావేశాలతో 1,87,752 ఇళ్ల యజమానులు స్వచ్ఛ ఆటోలకు చెత్త ఇవ్వట్లేదని.. ఇకనైనా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని పేర్కొన్నారు.
Similar News
News December 25, 2024
HYDలో అర్ధరాత్రి నుంచి సంబరాలు
హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి పండుగ వాతావరణం నెలకొంది. యేసు పుట్టిన రోజు సందర్భంగా అన్ని చర్చిలను అందంగా అలంకరించారు. స్టార్ ఆకారంలో పలుచోట్ల LED లైట్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో సెక్రటేరియట్, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్లో క్రిస్మస్ ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అయితే, మిడ్ నైట్ 12 గంటలకు చర్చిలకు వెళ్లిన క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Happy Christmas
News December 25, 2024
HYD: చీకటి ప్రాంతాలే అడ్డాగా..!
HYD శివారు చీకటి ప్రాంతాలను చైన్ స్నాచింగ్, గంజాయి, అసాంఘిక కార్యక్రమాలకు ముఠాలు అడ్డగా మార్చుకుంటున్నట్లు వివిధ కేసుల్లో తెలిసింది. శామీర్‌పేట, పెద్ద అంబర్ పేట, ఔటర్ రింగ్ రోడ్డు సమీప ప్రాంతాల్లో అన్నోజిగూడ, యమ్నంపేట, ఘట్కేసర్, మాధవరెడ్డి బ్రిడ్జి, అవుషాపూర్, తోండుపల్లి జంక్షన్, మల్లంపేట నుంచి దుండిగల్ వైపు ప్రాంతాల్లో ముఠాలు తిష్ట వేస్తున్నాయి.
News December 25, 2024
HYD: మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌తో మలేసియా ప్రతినిధులు భేటీ
HYD బుద్ధభవన్ కార్యాలయంలో తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ శారదతో మలేసియా ప్రతినిధుల బృందం భేటీ అయ్యారు. మహిళల హక్కులు, రక్షణకే కమిషన్ ఏర్పాటు చేసినట్లు ఛైర్పర్సన్ వారికి సూచించారు. సమాజంలో మహిళల పట్ల వివక్షతను తొలగించి, సాధికారత కృషి గురించి బృందానికి ఆమె తెలిపారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ సంతోష్, విజయ్ పాల్గొన్నారు.