News February 12, 2026
హైదరాబాద్–శ్రీశైలం రైల్వే లైన్‌కు సీఎం విజ్ఞప్తి

హైదరాబాద్–శ్రీశైలం–మార్కాపురం కొత్త రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలని CM చంద్రబాబు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. శ్రీశైలానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు నేరుగా రైలు సౌకర్యం కల్పించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. శ్రీశైలానికి మార్కాపురం స్టేషన్ 80 కి.మీ దూరంలో ఉండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ లైన్ అందుబాటులోకి వస్తే పర్యాటక రంగంతో పాటు ఆర్థిక రంగం వృద్ధి చెందనుంది.
Similar News
News April 14, 2026
అనంతపురంలో భార్య గొంతు కోసిన భర్త..!

తాళి కట్టిన భర్త భార్య గొంతును కోసిన ఘటన అనంతపురంలో మంగళవారం చోటుచేసుకుంది. నగరంలోని సైఫుల్లా బ్రిడ్జ్ సమీపంలో ఉన్న ఓ హోటల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. భార్య గొంతు కోస్తున్న సమయంలో అడ్డువచ్చిన వ్యక్తిపై భర్త కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ప్రస్తుతం బాధితుణ్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య, రక్షకుడైన క్షతగాత్రుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
News April 14, 2026
అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

మానవ తప్పిదాలు, ఇతర కారణాలతో జరిగే అగ్ని ప్రమాదాల పట్ల విస్తృతంగా అవగాహన కల్పించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఆదేశించారు. హనుమకొండ అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో ఈనెల 20 వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఫైర్ సర్వీస్ ఫ్లాగ్ ఆవిష్కరించి అమరులైన ఫైర్ సర్వీస్ సిబ్బందికి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ చేతుల మీదుగా గోడపత్రికల ఆవిష్కరించారు.
News April 14, 2026
భద్రాచలంలో నేత్రపర్వంగా శ్రీవారి నిత్య కళ్యాణం

భద్రాద్రి క్షేత్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్య కళ్యాణ వేడుక మంగళవారం వైభవంగా జరిగింది. తెల్లవారుజామునే స్వామివారికి సుప్రభాత సేవ, అభిషేకాలు నిర్వహించిన అనంతరం బేడా మండపంలో అర్చకులు కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.


