News November 17, 2024
హైదరాబాద్: సర్వేలో కలెక్టర్ వివరాల నమోదు
సమగ్ర సర్వేలో భాగంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తమ పూర్తి వివరాలను ఎన్యుమరేటర్‌కు అందజేశారు. ఆదివారం బంజారాహిల్స్ రోడ్డునంబర్- 13లోని కలెక్టర్ బంగ్లాకు వెళ్లిన సిబ్బంది ఆయనకు 75 ప్రశ్నలతో కూడిన సర్వే ఫారాన్ని అందజేశారు. క్షుణ్ణంగా దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అందులోని అన్ని ప్రశ్నలకు వివరాలు నమోదు చేసి అధికారులకు అందజేశారు.
Similar News
News November 18, 2024
HYDలో రేపే ఫుట్‌బాల్ మ్యాచ్
హైదరాబాద్‌లో రేపు ఇండియా, మలేషియా మధ్య ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ జరగనుంది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా రేపు రాత్రి 7 గంటలకు ఫుట్ బాల్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇందుకోసం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ భారీగా ఏర్పాట్లు చేస్తుంది. ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
News November 17, 2024
హైటెక్స్‌లో వివాహానికి హాజరైన కేటీఆర్
హైదరబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి కుమారుడు శశిధర్ రెడ్డి, అక్షిత రెడ్డి వివాహ మహోత్సవానికి మాజీ మంత్రి, BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు లక్ష్మా రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు.
News November 17, 2024
ALERT: హైదరాబాద్ ఫుడ్ డేంజర్!
HYDలోని రెస్టారెంట్లలో క్వాలిటీ తగ్గుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే ఇందుకు నిదర్శనం. దేశంలోని 19 ప్రధాన నగరాల్లో HYD కల్తీలో నం.1 అని సర్వే పేర్కొంది. ఏకంగా 62% హోటళ్లు గడువు ముగిసిన ఆహార పదార్థాలు కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు పేర్కొంది. గడిచిన 2 నెలల వ్యవధిలోనే 84% ఫుడ్ పాయిజన్ కేసులు నగరంలో నమోదు కావడం గమనార్హం. దీంతో GHMC అప్రమత్తమైంది. అన్ని హోటల్స్‌లో తనిఖీలు చేపట్టింది.