News August 26, 2025
హైదరాబాద్ హాఫ్ మారథాన్‌లో కర్నూలు వాసి సత్తా

హైదరాబాద్‌లో జరిగిన హాఫ్ మారథాన్ రన్ రేస్‌లో కర్నూలు నగరానికి చెందిన హిమబిందు ప్రతిభ కనబరిచారు. మూడు ప్రధాన ఫ్లైఓవర్ల మీదుగా 21 కిలోమీటర్లు పరిగెత్తి, కేవలం 2 గంటల 53 నిమిషాల్లోనే పూర్తి చేశారు. హిమబిందు విజయంతో జిల్లాలోని క్రీడాభిమానులు, క్రీడాసంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. హిమబిందు ప్రదర్శన నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని వారు అభినందించారు.
Similar News
News August 26, 2025
రాత్రి 10 తర్వాత వినాయక మండపాల వద్ద స్పీకర్లు ఆపివేయాలి: ఎస్పీ

వినాయక ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో ఘనంగా జరుపుకుందామని, రాత్రి 10 గంటల తర్వాత వినాయక మండపాల వద్ద లౌడ్ స్పీకర్లు ఆపివేయాలని విగ్రహ ఉత్సవ కమిటీలకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. విగ్రహ ఉత్సవ కమిటీ సభ్యులు తప్పనిసరిగా మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు.
News August 26, 2025
పర్యావరణహిత గణేశ్ విగ్రహాలను ప్రతిష్టిద్దాం: మంత్రి

విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రాభివృద్ధితో పాటు ప్రజలందరి జీవితాల్లో శాంతి, ఐశ్వర్యం, ఆనందం నిండాలని భగవంతుని కోరుకుంటున్నట్లు మంత్రి టీజీ భరత్ అన్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పర్యావరణహిత గణేశ్ విగ్రహాలను ప్రతిష్ఠించి, పండుగను సంతోషంగా, ఆనందంగా జరుపుకోవాలని మంత్రి ఆకాక్షించారు. ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు.
News August 26, 2025
పర్యావరణాన్ని పరిరక్షిస్తూ పండగ చేసుకుందాం: కలెక్టర్

పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ప్రతీ ఒక్కరం వినాయక చవితి పండుగను జరుపుకుందామని కలెక్టర్ పి.రంజిత్ బాషా మంగళవారం పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. గణనాథుని కృపతో జిల్లా అభివృద్ధితో పాటు ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వినాయకుడి ఆశీస్సులతో జిల్లా ప్రజలకు మంచి జరగాలని, చేపట్టే ప్రతీ పనిలో విజయం చేకూరాలని ఆకాంక్షించారు.